Happy Birthday Harish Shankar: సినిమా కొందరికి వ్యాపారం, మరికొందరికి జీవితం.సినిమాలు చూసి ఆనందించే వాళ్ళు కొందరైతే, సినిమాలు తీస్తూ ఆనందాన్ని ఫీల్ అయ్యేవాళ్ళు కొందరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి.
అందరూ ఒక గొప్ప కథను ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు అందరికీ తెలిసిన కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తారు. సినిమా ద్వారా ఎంటర్టైన్ చేయాలి. లేదంటే ఎడ్యుకేట్ చేయాలి అని బలంగా నమ్మిన దర్శకుడు హరీష్ శంకర్. తన సినిమాతో ఎడ్యుకేట్ చేయలేను కాబట్టి ఎంటర్టైన్ చేస్తాను అంటుంటారు హరీష్ శంకర్.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడుగా నిలబడటానికి చాలామంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కొంటారు. ప్రతి దర్శకుడు లైఫ్ లో జరిగినట్లే హరీష్ శంకర్ లైఫ్ లో కూడా జరిగాయి. అహర్నిశలు కష్టపడి రాసిన ఒక సినిమాకి, ఒక దర్శకుడు ఈ సినిమాకి క్రెడిట్స్ ఇవ్వలేకపోతున్నాను అంటే బాధను దిగమింగుకొని, కళ్ళల్లో నుంచి నీళ్లు దించుకుని, కాళ్ళతో కిలోమీటర్లు నడిచిన రోజులు హరీష్ జీవితంలో ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ మనిషిని స్ట్రాంగ్ గా చేస్తాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు హరీష్ శంకర్ జీవితంలో ఉన్నాయి. హరీష్ శంకర్ చాలా క్లారిటీ ఉన్న ఒక దర్శకుడు. విభిన్న కోణాలు ఉన్న మనిషి.
హరీష్ శంకర్ గట్ ఫీలింగ్
దర్శకుడుగా మొదటి సినిమా “షాక్” ఇచ్చింది.రెండో సినిమాకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ.అప్పటికీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ చాలా వరకు తీసుకున్నాడు.ఈయన ఏదైనా చెబుతుంటే ప్రొడ్యూసర్ ఇదివరకే తీసిన
బ్లాక్ బస్టర్ సినిమాలు గురించి చెబుతున్నాడు.ఆ ఆర్గ్యుమెంట్స్ కాస్తా గొడవకు దారితీసాయి.రేపు పదివేలు రూమ్ రెంట్ కట్టాలి, చేతిలో రూపాయి లేదు.ఎదురుగా పది లక్షలు రూపాయిల చెక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్న ప్రొడ్యూసర్. “ఈగో” కి సెల్ఫ్ రెస్పెక్ట్ కి తేడాను గ్రహించి సినిమాని వదిలేసాడు. అది పొగరు అని కొందరంటారు.కాదు గట్ ఫీలింగ్ అని హరీష్ శంకర్ నమ్మాడు.ఆ హరీష్ శంకర్ చాలమందికి ఇష్టం.
మన చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా
మనలని ఎవడు నమ్మకపోయినా
మన టాలెంట్ బయటపడేంతటాలెంట్ ఫిలిం మేకర్ కి
కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, యాటిట్యూడ్ ఇవన్నీ ఉండాలి.
ఇవే చాలామందికి సమాధానం అని మనకు హరీష్ శంకర్ లైఫ్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది.
హరీష్ శంకర్ ఒపీనియన్స్
అంటే ఒక మనిషి ఇంకో మనిషితో పోల్చుకోవడం అంటే దరిద్రం.
ఎంత దరిద్రం అంటే..
ఒకవేళ ఆ మనిషి కంటే మనం తక్కువ ఉన్నాం అనుకోండి
ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వస్తుంది.ఒకవేళ ఆ మనిషి కంటే బెటర్ ఉన్నాం అనుకోండి గర్వం వస్తుంది. అతను అతను నేను నేనే అనుకోవడం చాలా బెస్ట్. పక్కింటి వాడు, ఎదురింటివాడు లైఫ్ నీకు బారామీటర్, పారామీటర్ కాదు.
హరీష్ సాహిత్యం ఇచ్చే వాల్యూ
తన సినిమాలకు పాటలు రాసే సాహిత్య రచయితలకు సాష్టాంగ నమస్కారం చేసేంత ఉన్నత సాహిత్య విలువలు ఉన్న దర్శకుడు. సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుగు పాట వినిపించాలి అనే ఉద్దేశ్యం ఉన్న దర్శకుడు. క్రూర మృగాలు, వన్యమృగాలతో పాటు తెలుగు సాహిత్యాన్ని తెలుగు పాటని కూడా కాపాడుకుందాం అంటుంటారు హరీష్. తన సినిమాలో సందర్భాన్ని బట్టి పాటలు రాయించుకుంటాడు హరీష్ కు తెలుసు. తన సినిమాలో విలన్ మద్యం సేవిస్తున్నప్పుడు కెవ్వు కేక లాంటి ఒక ఐటెం సాంగ్ ను రాయించగలడు. ఒక అగ్రహారం కుర్రోడు తన ప్రేయసి ఊహించుకున్నప్పుడు “అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం” వంటి పాటను కూడా రాయించగలడు.
దర్శకుడిగా మొదటి సినిమా హరీష్ శంకర్ కి షాక్ ఇస్తే, మూడవ సినిమాతో హరీష్ శంకర్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఇలానే తీయాలి అని కాకుండా ఇలా కూడా తీయొచ్చు అని నిరూపించిన దర్శకుడు. తన మ్యూజింగ్స్ తో చాలామందికి దారి చూపే దిశా నిర్దేశకుడు. అందరూ మాట్లాడుతుంటారు కానీ హరీష్ మాటలతో ఆడుకుంటాడు.
అక్షరానికి అమ్మ అంత గౌరవాన్ని ఇచ్చే #HarishShankar కి Happy Birthday.!