Couple Suicide: పగబట్టి కావాలని ఏవరైనా చేశారా? లేక ఫ్యామిలీ సమస్యలా? ఆర్థిక సమస్యలా? కారణం తెలీదు. ఐదుగురు సభ్యుల గల ఫ్యామిలీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు మృతి చెందగా, ముగ్గురు పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. అసలేం జరిగింది? ఎక్కడ?
ఏం జరిగింది?
గుజరాత్‌లోని సంబర్కాంత జిల్లా వడాలి పట్టణానికి చెందిన విను సాగర్- భార్య కోకిలబెన్ హ్యాపీగా ఉండేవారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా. ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయ్యారు. అమ్మాయికి 19 ఏళ్లు. ఇద్దరు అబ్బాయిలకు ఒకరికి 18, మరొకరికి 17 ఏళ్లు ఉంటాయి. కష్టాలు ఒకరికొకరు చెప్పుకునేవారు. వీలైనంత తమ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేవారు.
హాయిగా సాగుతున్న సంసారంలో ఊహించని కుదుపు. ఏం జరిగిందో తెలీదు. శనివారం వాంతులతో బాధపడడం మొదలైంది. వెంటనే అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్‌లో ఫ్యామిలీని వడాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హిమ్మత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ భార్యభర్తలిద్దరూ మృతి చెందారు. ముగ్గురు పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. అయినా వారి పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యుల మాట. పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. విను సాగర్ ఫ్యామిలీ విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. ఈ క్రమంలో విసుసాగర్ దంపతులు మృతి చెందారని తెలిపారు.
ALSO READ: లిఫ్ట్ మీద పడి డాక్టర్ మృతి, ఏం జరిగింది?
దర్యాప్తులో పోలీసులు
వినుసాగర్ మృతి ఘటన వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. విను సాగర్‌కు 42 ఏళ్లు, ఆయన భార్య కోకిలాబెన్ కు 40 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. వినుసాగర్ ఫ్యామిలీ ఉంటున్న ప్రాంతం వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. ఇప్పుడు పిల్లలు పరిస్థితి ఏంటి? అన్నదే ప్రశ్నగా మారింది. మరోవైపు పోలీసులు మాత్రం దర్యాప్తులో నిమగ్నమయ్యారు. వినుసాగర్ ఇంట్లో ఏమైనా లేఖలు ఉన్నాయా? ఏమైనా విషానికి సంబంధించి ఏమైనా పదార్థాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం వినుసాగర్ ఫ్యామిలీ సూసైడ్ వ్యవహారం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. పిల్లలు తేరుకుంటే ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. లేకుంటే కష్టమని అంటున్నారు. వినుసాగర్ సూసైడ్ వెనుక ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: బలవంతంగా మహిళకు మద్యం తాగించి, ఆపై గొంతు కోశారు, మృతదేహాన్ని కాల్చి నదిలో పడేశారు