Lift Accident: అపార్ట్మెంట్‌లోని లిఫ్ట్ మీద పడడంతో RMP డాక్టర్ మృతి చెందాడు. హైదరాబాద్ సూరారాం పీఎస్ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
లిఫ్ట్ గుంతలో బాల్ పడడంతో దాన్ని తిసేందుకు RMP డాక్టర్ అక్బర్ కిందకు దిగాడు. అది గమనించకుండానే లిఫ్ట్ ఆన్ చేయడంతో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఒక్కసారిగా లిఫ్ట్ కిందకు రావడంతో అక్బర్ తీవ్రంగా గాయపడ్డాడు. అపార్ట్మెంట్ వాసులు వచ్చి చూసేసరికి లిఫ్ట్ గుంతలోని అతను ప్రాణాలు కోల్పోయి కనిపించాడు.
మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సూరారంలో అక్బర్ RMPగా పని చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ: ఆస్తి కోసం కూతురిని హతమార్చిన సవతి తల్లి
కాగా, ఈ మధ్య కాలంలో లిఫ్ట్‌ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్‌లలో ఉండే లిఫ్ట్‌లలో అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగితే.. టెక్నికల్ సమస్యల వల్ల కొన్ని అనర్ధాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
గత నెలలో దాదాపు ఐదుగురు లిఫ్ట్ వల్ల జరిగిన ప్రమాదాల్లోనే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా వీటిపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారు కూడా అజాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.