Big Stories

PBKS vs KKR IPL 2024- Preview: పంజాబ్ కింగ్స్ పరువు నిలబెట్టుకుంటుందా? నేడు కోల్ కతా తో మ్యాచ్

PBKS vs KKR Match Prediction(Sports news in telugu): ఐపీఎల్ 2024 సీజన్ లో ట్రోఫీ గెలవగలిగే సత్తా ఉన్న జట్లలో కోల్ కతా ఒకటిగా కనిపిస్తోంది. ఇప్పటికే టాప్ 2లో ఉంది. ఇక అట్టడుగున కొట్టుమిట్టాడుతున్న పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7.30కి రెండు జట్ల మధ్యా మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

ఇప్పటివరకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా 7 మ్యాచ్ లు ఆడి 5 గెలిచింది. రెండు ఓడింది. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే 8 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మాత్రమే గెలిచి, ఆరు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.

- Advertisement -

వీరిద్దరి మధ్యా ఇప్పటివరకు 32 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కోల్ కతా 21 సార్లు విజయ దుందుభి మోగించింది.

కోల్ కతా లో ఓపెనర్ల దగ్గర నుంచి అందరూ అద్భుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, అంగ్ క్రిష్ రఘువంశీ ఒకరి తర్వాత ఒకరు అందుకుంటున్నారు. స్కోరుని ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. బౌలింగులో కూడా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, అండ్రి రస్సెల్, వరుణ్ చక్రవర్తి అందరూ మ్యాచ్ ని నిలబెడుతున్నారు.

Also Read: ఇండోనేషియా అమ్మాయి అదుర్స్ .. ఒక్క పరుగు ఇవ్వకుండా.. 7 వికెట్లు

పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మొదటి నుంచి జట్టు ఓటమి బాటలో నడుస్తోంది. అన్నింటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్, ముఖ్యంగా ఫీల్డింగు అన్నిరకాలుగా ముందడుగు వేయలేక చతికిలపడుతోంది. ఓపెనర్లు అథర్వ, శామ్ కర్రన్ విఫలమవుతున్నారు. జానీ బెయిర్ స్టో కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు.

వికెట్ కీపర్ జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, లివింగ్ స్టోన్ ఎవరూ ఆకట్టుకోవడం లేదు. అశుతోష్ శర్మ మాత్రం ఒకట్రెండు సార్లు మెరిశాడు. ఇక బౌలింగులో అర్షదీప్ సింగ్, రబాడా, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ ఎవరూ కూడా మ్యాచ్ విన్నర్లుగా మారడం లేదు. ఏదో మమ అనిపిస్తున్నారు. దీంతో పంజాబ్ చివరి స్థానాల్లో చతికిలపడింది.

అన్నిటికన్నామించి కెప్టెన్ శిఖర్ ధావన్ అర్థాంతరంగా వదిలేయడంతో జట్టు మరింత నీరసించిపోయింది. మరి ఆర్సీబీలా పుంజుకుంటుందా? చేతులెత్తేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News