Rajasthan Crime News: ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఫ్యామిలీ సమస్యలా? పరువు పోతుందని ఎవరైనా ట్రాక్ తప్పారా? కూతురు లవ్‌లో పడిందా? ఇలా కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే ఒకేసారి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ హత్యా? ఆత్మహత్యా? ఇదే డౌంట్ పోలీసులను వెంటాడుతోంది. పోర్టుమార్టం నివేదిక వచ్చేవరకు తామేమీ చెప్పలేమని అంటున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
రాజస్థాన్‌లో ఫ్యామిలీ సభ్యులు మరణం
రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో ఒక ఇంట్లో వ్యాపారవేత్త ఫ్యామిలీ చనిపోయింది. వ్యాపారవేత్త నితిన్ ఖత్రి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు అమ్మేవాడు. అతనికి షాపులో భార్య చేదోడు వాదోడుగా ఉండేది. ఖత్రి కూతురు పేరు జెస్సికా. చాలా అందంగా ఉంటుంది ఇంటర్ చదువుతోంది. వీరి వ్యాపారం బాగానే జరిగింది. మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్ధిళ్లుతోంది. ఏనాడు వారికి సమస్యలు ఉన్నట్లు బయటవారికి తెలీదు. ముఖ్యంగా బంధువులకు సైతం ఏమీ తెలీదు.
ఖత్రి ఫ్యామిలీలో ఏం జరిగిందో ఆ సీక్రెట్ ఎవరికీ తెలీదు. కాకపోతే వ్యాపారవేత్త ఇంట్లో నుంచి వాసన రావడం ఇరుగు పొరుగువారు పసిగట్టారు. రోజురోజుకూ వాసన పెరుగుతోంది. ఫ్యామిలీ సభ్యులు ఎవరూ తలుపులు తెరవలేదు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తలుపు బద్దలు కొట్టారు.
తలుపు ఓపెన్ కాగానే ఇంట్లో నుంచి ఒకటే దుర్వాసన వస్తోంది. ఇంట్లో నితిన్ ఖత్రి ఉరేసుకుని కనిపించాడు. అతడి భార్య రజిని, కూతురు జెస్సికా నేలపై పడి ఉన్నారు. ఖత్రి ఫ్యామిలీని చూసి ఒక్కసారిగా పోలీసులు షాకయ్యారు. కాసేపు నోటి వెంట మాట రాలేదు. ఈ ఘటన జరిగి దాదాపు రెండువారాలు అవుతుందని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు.
ALSO READ: ప్రియుడితో కలిసి భర్త లేపేసింది.. పట్టపగలు డెడ్ బాడీని బైక్ పై తీసుకెళ్తూ
హత్యా.. ? ఆత్మహత్యా?
ఆ సీన్ చూసిన పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. భార్య రజని చంపేసి, ఆ తర్వాత 18 ఏళ్ల కూతురు జెస్సికాను హత్య చేసి, ఆపై ఖత్రి ఆత్మహత్య చేసుకుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించామని డిప్యూటీ ఎస్పీ విశాల్ జాంగిద్ తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో నితిన్ తన భార్య, కుమార్తెను చంపి ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మృతికి కచ్చితమైన కారణం తెలీదని, పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
ఖత్రి ఫ్యామిలీ మరణం కేసు పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇళ్లు, షాపు చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన గురించి ఖత్రి బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. కనీసం ఇంట్లో ఎలాంటి లేఖలు లభించలేదు. కనీసం ఫోన్ ద్వారా అయినా హత్య గుట్టు వీడుతుందా? చివరకు సస్పెన్స్ గా మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.