IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
మార్చి 22వ తేదీన ప్రారంభం కాబోతోంది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు అంటే దాదాపు 75 రోజులపాటు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… కొనసాగుతుందన్నమాట. ఒక్కో జట్టు… రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత.. ఎలిమినేటర్ అలాగే ప్లే ఆఫ్ మ్యాచులు ఉంటాయి. చివరకు ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే ఫ్యాన్స్… కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Chahal T-shirt: ఎవడి డబ్బు వాడే సంపాదించుకోవాలి..చాహల్ టీ-షర్ట్ ఫోటో వైరల్ ?
ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్తున్నారా ?
ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్లే ముందు.. కచ్చితంగా ఫిజికల్ టికెట్ కూడా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభం కంటే ముందు… స్టేడియం వద్దకు వెళ్లాలి. అంటే సాయంత్రం ఏడున్నరకు మ్యాచ్ ఉంటే.. 4:30 గంటలకు స్టేడియం వద్దకు వెళ్లాలి. అంటే మ్యాచ్ ప్రారంభాని కంటే మూడు గంటలకు ముందే… స్టేడియానికి వెళ్ళాలి. ఇక మనం టికెట్ తీసుకుపోవడం మర్చిపోతే…. లోపలికి ప్రవేశం లేదు. ఎందుకంటే టికెట్ పైన బార్ కోడ్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టికెట్ కచ్చితంగా తీసుకువెళ్లాలి.
ఇక టికెట్ చినిగిన, డ్యామేజ్ అయిన లోపలికి ప్రవేశం ఉండదు. ఇక ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత… బయటికి వెళ్లి మళ్లీ వస్తా అంటే కుదరదు. ఒకసారి లోపలికి వెళ్ళామంటే మ్యాచ్ పూర్తి అయ్యేవరకు ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బయటికి వెళ్లిపోతే… మళ్లీ వస్తానంటే లోపలికి రానివ్వరు. ( Indian Premier League 2025 Tournament )
చిన్నపిల్లలకు టికెట్ తీసుకోవాలా ?
ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్లేవారు ప్రతి ఒక్కరు టికెట్ ( IPL Tickets) తీసుకోవాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు… రూల్స్ ప్రకారం టికెట్ తీసుకోవాలని చెబుతున్నారు. లేకపోతే వాళ్లకు ప్రవేశం ఉండదు. ఇక మ్యాచ్ క్యాన్సిల్ అయితే టికెట్ కు సంబంధించిన డబ్బులు తిరిగి ఇస్తారా? అనే డౌట్ కూడా అందరిలోనూ ఉంటుంది. ఒక బంతి కూడా పడకుండా మ్యాచ్ క్యాన్సిల్ అయితే… అప్పుడు ఎంతో కొంత రిఫండ్ వస్తుంది. కానీ ఒక్క బంతి పడి మ్యాచ్ పూర్తిగా క్యాన్సిల్ అయితే.. ఒక రూపాయి రాదు.
Also Read: SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?
ఎలాంటి వస్తువులు స్టేడియానికి తీసుకు వెళ్ళకూడదు..?
స్టేడియానికి వెళ్లేటప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అసలు తీసుకువెళ్లకూడదు. ముఖ్యంగా కెమెరాలు, ఫోన్లు, రికార్డు చేసే వస్తువులు అస్సలు తీసుకువెళ్లకూడదు. ఆయుధాలు, గుట్కా, తంబాకు అలాగే డ్రగ్స్ లాంటివి కూడా నిషేధం. బాటిల్స్, లైటర్స్, టిన్నులు, మ్యూజిక్ సంబంధించిన వస్తువులు , బ్యాగులు అలాగే లాప్టాప్ లు, హెల్మెట్లు లోపలికి తీసుకు వెళ్ళకూడదు. లోపల స్మోకింగ్ కు అస్సలు పర్మిషన్ ఉండదు.