Intinti Ramayanam Today Episode March 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని నిన్న ప్రణతి పెళ్లి కావడంతో ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు ఆవేశం తగ్గింటది వాళ్లతో మాట్లాడాలి అసలు ఏంటన్న విషయం వాళ్లకి చెప్పాలి అని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళుతుంది కానీ పార్వతి మాటలు విని బయటనే ఆగిపోతుంది. శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వదిన ఏం చెప్పాలనుకునిందో వెంటనే కదా అసలు ఏమైందో అర్థం అవుతుంది అసలు ఎవరిది తప్పు అని తెలుస్తుంది అని అంటారు. కానీ రాజేంద్ర ఒకసారి మాత్రం వినేది ఏం లేదు అని అంటాడు.. ఇక భానుమతి ప్రణతి పెళ్లికి ముందే కాల్ జారిందేమో అందుకే గుడ్డు చప్పుడు కాకుండా పెళ్లి చేసిందేమో అని అంటుంది. నా కూతురు గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావ్ నా తల్లి వై పోయావు. అదే వేరే ఎవరైనా ఇలాంటి మాటలు అంటే ఇక ఎలా ఉండేదో ఊహించలేవు గాని రాజేంద్రప్రసాద్ గట్టిగా ఇస్తారు. మీరేంటండి ఇంత ఆవేశపడతారు అత్తయ్య ఏదో చాదస్తంతో అలా మాట్లాడింది మన ప్రణతి గురించి మనకు తెలియదా అనేసి పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ కి గుండెపోటు రావడంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి నావల్ల అందరికి గొడవలు జరుగుతున్నాయి. నేనే లేకుంటే ఇలాంటివి జరగవు అని ప్రణతి ఆలోచిస్తుంది. ఇంట్లోంచి బయటికి వెళ్లాలని ప్రణతి ఆలోచిస్తుంది అప్పుడే అవని చూస్తుంది. నీకేమైనా సాయం చేయనా బయటికి వెళ్లాలనుకుంటున్నావా అనేసి అడుగుతుంది. నేను ఇక్కడ ఉంటే అందరికీ గొడవలు జరుగుతున్నాయి వదిన నేను లేకున్నా ఉంటేనే ఈ సమస్యలన్నింటికీ దూరం అయిపోతాయని అంటుంది ప్రణతి. నువ్వు ఇలాంటి వాటికి దూరంగా వెళ్తే సమస్యలు తగ్గిపోతాయని అనుకుంటున్నావు నీ సమస్యలతో పోలిస్తే నా సమస్యలు ఎన్ని ఉన్నాయో చూసావు కదా.. ఈ సమస్యలన్నీ తీరాలంటే నీకన్నా ముందు నేను చచ్చిపోవాలి మరి నేను చచ్చిపోయానా చచ్చిపోతే సమస్యలు పరిష్కారం అవ్వవు అని అవని ప్రణతికి ధైర్యం చెబుతుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమేనా నువ్వు బ్రతకాలి నేను నీకు వదినగా చెప్పలేదు నీకు అమ్మగా చెప్తున్నాను అని అనగానే ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నువ్వు నాకు వదినవి కాదు నిజంగానే అమ్మవే అని ప్రణతి బాధపడుతుంది. ఇక అవని బొకే షాప్ తరఫున ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ పువ్వులని మారుస్తుంది కానీ అక్షయ మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు కనిపిస్తుంటే నాకు నువ్వు చేసిన మోసమే గుర్తొచ్చింది. నిన్ను ఎంతగా నమ్మాను కానీ నువ్వు నన్ను ఇంతగా మోసం చేస్తావని నాకు అస్సలు ఊహించలేదు. నువ్వు నా ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు అని అక్షయ్ అంటాడు. మీ కింద పనిచేయట్లేదు నేను బొకే షాప్ కి కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా దాని ద్వారా వస్తున్నాను. మీరు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పండి అనేసి అంటుంది. నన్ను చూస్తే మీ మనసు ఎక్కడ మారిపోతుందని భయపడుతున్నారా అందుకే మీరు ఇలా అంటున్నారా లేదంటే మరి నన్ను రోజు చూడాల్సిందే హావ్ ఏ నైస్ డే అని చెప్పేసి వెళ్ళిపోతుంది..
ఇక రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటే పల్లవి శ్రీయాలు అక్కడికి వచ్చి మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మావయ్య గారు క్రిమినల్ బ్రెయిన్ తో ప్రణతిని మార్చేసింది ఇలాంటివి అందరిలోనూ జరుగుతూ ఉంటాయి. మీరేం బాధపడకండి అనేసి అంటారు. మీ మావయ్య అలా బాధపడుతుంటారు కాబట్టి నేను గుడికి తీసుకెళ్లామని అనుకుంటున్నాను అని పార్వతి వస్తుంది ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు.
అటు అవని, భరత్ ఇద్దరు ప్రణతి ప్రేమించిన అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటారు. కావాలని మోసం చేశాడా లేకపోతే పారిపోయాడో అర్థం కావట్లేదని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మధ్యలో గుడి కనిపిస్తే గుడికి వెళ్తానని అవని అంటుంది. ఇక ఆ గుడికి పార్వతి రాజేంద్రప్రసాద్ కూడా వస్తారు.
గుడి నుంచి బయటికి వెళ్తున్న సమయంలో భరత్ కనిపించడంతో రాజేంద్రప్రసాద్ ఆవేశంతో కోపం కట్టలు తెంచుకుంటుంది.. భరత్ నువ్వు కొడతాడు ఎందుకు కొడుతున్నారని అడుగుతుంది. దుర్మార్గుడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోశావు నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు ఊహించలేదు అంటూ రాజేంద్రప్రసాద్ అవని పై సీరియస్ అవుతాడు.. రాజేంద్రప్రసాద్ పార్వతి ఇంటికి రాగానే రాజేంద్రప్రసాదం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఏమైందని అడుగుతారు. ఆ అవని భరత్ గుడిలో కనిపించారు. ఆవేశంతో ఆ భరత్ ని చితక్కొట్టాడు అని అంటారు.
కనిపిస్తే కొట్టడం కాదు చంపేయాలని అనిపిస్తుంది. వాడు చేసిన మోసానికి ప్రణతి జీవితం నాశనం అయ్యింది. అలాంటి వాడిని వదిలేయడం కాదు వాడి కాళ్లు చేతులు ఇరగ్గొట్టేలా పోలీసులకు అప్పజెప్పాలి అని పల్లవి అంటుంది. వాడి నుంచి మన ప్రణతిని ఎలాగైనా తీసుకొచ్చి వాడి కట్టిన తాళిని తెంచేసి తన జీవితాన్ని బాగుపడేలా గుట్టు చప్పుడు కాకుండా మరో పెళ్లి చేసి తనని పంపించాలి అని పల్లవి సలహాలు ఇస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ పల్లవి మాటని వెంటాడు అక్కడితో ఎపిసోడ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రణతి రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..