E-Paper
Advertisement

East Godavari District Crime: కుటుంబ కలహాల చిచ్చు.. భార్య, అత్తని పొడిచి పొడిచి చంపిన భర్త, ఎక్కడో తెలుసా?

East Godavari District Crime: కుటుంబ కలహాల చిచ్చు.. భార్య, అత్తని పొడిచి పొడిచి చంపిన భర్త, ఎక్కడో తెలుసా?
Advertisement

East Godavari District Crime: కారణాలు ఏంటో తెలీదు. భార్య, అత్త వ్యవహారశైలిపై ఎప్పటి నుంచి ఆగ్రహం పెంచుకున్నాడో తెలీదు. రోజు రోజుకూ ఆ కోపం కాస్త ఉగ్రరూపం దాల్చింది. చివరకు సోమవారం భార్య, అత్తని కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు ఆమె భర్త. సంచలనం రేపిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. కుటుంబ కలహాల చిచ్చు

Advertisement

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక దారుణమైన ఘటన జరిగింది. సీతారామరాజు-లత ఇద్దరు ప్రేమించు కున్నారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగింది. ఎలాంటి కలతలు లేకుండా ప్రశాంతంగా సాగింది. వీరి సంసారంలోకి లత తల్లి ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్లున్న తర్వాత పెద్దామె ఇంటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి దంపతుల మధ్య చీటి మాటికీ గొడవలు మొదలయ్యాయి. దీనికితోడు ఇరుగుపొరుగు మాటలు కూడా తోడయ్యాయి. ఫలితంగా పట్టరాని కోపంతో భార్య, అత్తని చంపితే తన పగ తీరుతుందని భావించాడు సీతారామరాజు. అందుకు పక్కాగా ప్లాన్ చేశాడు. లత కొన్నాళ్లుగా తల్లి దగ్గర ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లాడు సీతారామరాజు.

Advertisement

భార్య, అత్తని పొడిచి పొడిచి చంపిన భర్త

తనతోపాటు పదునైన కత్తిని కూడా తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన కొద్ది క్షణాలకు తనతో తెచ్చుకున్న కత్తితో భార్య లత, అత్త లక్ష్మిలను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. భార్యపై అనుమానం ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. గతంలో ఓ హత్య కేసులో జైలు కెళ్లాడు సీతారామరాజు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారవుతున్న సమయంలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

ALSO READ: దారుణం.. మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్క.. నిద్రపోతున్న జడ్చర్ల ఆసుపత్రి యంత్రాంగం!

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×