E-Paper
Advertisement

Man Kills Niece| పెళ్లికి కొన్ని రోజుల ముందు యువతి దారుణ హత్య.. ఏం చేసిందంటే..

Man Kills Niece| పెళ్లికి కొన్ని రోజుల ముందు యువతి దారుణ హత్య.. ఏం చేసిందంటే..
Advertisement

Man Kills Niece| మరి కొన్ని రోజుల్లో పెళ్లిచేసుకోబోతున్న యువతి ఇటీవల రక్షాబంధన్ వేడుక రోజు తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ తరువాత ఆమె కనబడడం లేదని ఆ బంధువులు.. యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఎంతవెతికినా కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ఆ యువతి శవం పోలీసులకు లభించింది. అయితే ఆమె హత్య వెనుక షాకింగ్ కారణాలు తెలిశాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతి రక్షాబంధన్ రోజు తన మేనమామ ఇంటికి వెళ్లింది.రెండు రోజుల తరువాత ఆమె మేనమామ మణికాంత్.. యువతి తండ్రికి ఫోన్ చేశాడు. ”మాన్సీ కనబడడం లేదు.. ఆమె ఫోన్ స్విచాఫ్ వస్తోంది.. ఎక్కుడుంది..” అని ఆమె తండ్రిని అడిగాదు. ఇది విని మాన్సీ తండ్రి రామ్ సాగర్ పాండే ఆశ్చర్యపోయాడు. మాన్సీ.. మణికాంత్ ఇంటికే కదా వెళ్లింది. మరి అతను మాన్సీ కనబడడం లేదని ఎందుకు చెబుతున్నాడో? మాన్సీ తండ్రికి అర్థం కాలేదు.

Advertisement

మాన్సీ తండ్రి వెంటనే తన గ్రామం నుంచి బయలుదేరి హర్దోయ్ పట్టణానికి వెళ్లాడు. అక్కడ మణికాంత్ తో కలిసి ఒక రోజంతా తన కూతురు కోసం వెతికాడు. కానీ ఆమె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాన్సీ మిస్సింగ్ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ముందుగా ఆమె ఫోన్ ని ట్రాక్ చేశారు. అయితే ఫోన్ స్విచాన్ ఉంది. కానీ ఆ ఫోన్.. పోలీసులకు ఒక బస్సులో దొరికింది. అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. ఎవరో కావాలని మాన్సీ ఫోన్ ని బస్సుల ఉంచారని. దీంతో పోలీసులు బస్టాండు లోని సిసి కెమెరాలను పరిశీలించారు.

చాలా సీసీటివి వీడియోలను పరిశీలించిన తరువాత అసలు దొంగను పట్టుకున్నారు. అతనెవరో కాదు మాన్సీ మేనమామ మణికాంత్. పోలీసులు మణికాంత్ ని అదుపులోకి తీసుకొని తమ విధానంలో గట్టిగా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. మాన్సీని హత్య చేసి ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో దాచిపెట్టానని తన నేరం అంగీకరించాడు. పోలీసులకు మాన్సీ శవం నిందితుడు మణికాంత్ చెప్పినచోట దొరికింది.

Advertisement

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

అయితే మాన్సీ హత్యకు కారణమేమిటో పోలీసులు తెలుసుకునేందుకు హంతకుడు మణికాంత్ ను మరో సారి విచారణ చేయగా.. అప్పుడతను షాకింగ్ విషయాలు చెప్పాడు. నవంబర్ నెలలో మాన్సీ పెళ్లి చేసుకోబోతందని.. అయితే తన మేనకోడలితో తనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. అందుకే మాన్సీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఈ కారణంగా మాన్సీని పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఆమె వినక పోవడంతో పట్ట లేని కోపంతో ఆమె గొంతు నులిమి చంపేశానని తెలిపాడు.

పోలీసులు మాన్సీ హత్య కేసులో మణికాంత్ పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ సాగుతోంది.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×