Actress Breakup Story : ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం చాలా కామన్ గా జరుగుతుంది. అయితే ఆ లవ్ ఫైనల్ వరకు ఉండి… పెళ్లి పీటలెక్కుతుందా..? అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. పీకల వరకు లవ్ చేసుకుని పెళ్లి పీటలెక్కకుండా… విడిపోయిన జంటలు ఇండస్ట్రీలో చాలా ఎక్కువే. ఆ లిస్ట్ లోకి ఈ మధ్యనే ఓ జంట చేరిపోయింది. తాము ప్రేమలో ఉన్నామని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన ఓ జంట ఇప్పుడు విడిపోయింది. దీనికి కారణం ఓ డైరెక్టర్ అని తెలుస్తుంది. ఆ విడిపోయిన జంట ఎవరో…? దానికి కారణమైన డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ స్టార్ హీరోయిన్… తెలుగు ఇండస్ట్రీని ఏలేసింది. తర్వాత బాలీవుడ్ బాట పట్టి… అక్కడ కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. ఆ… క్రమంలోనే ఓ నటుడితో ప్రేమలో పడిపోయింది. చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగారు. పుకార్లు వస్తే… ‘అవును మేం ప్రేమలో ఉన్నాం’ అని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే పెళ్లి అని కూడా సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారు.
తీరా… ఇప్పుడు చూస్తే వాళ్లు ఇద్దరు విడిపోయారు. అవును వాళ్లు ఇద్దరు విడిపోయారు అంటూ అటు బాలీవుడ్… ఇటు టాలీవుడ్ కోడై కూసింది. కానీ, కారణాలేంటో ఎవ్వరికీ తెలీదు. కానీ, వీళ్లు అయితే.. సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా డిలీట్ చేసుకున్నారు. అంతే కాదు… ఈ హీరోయిన్… బ్రేకప్ అర్థం వచ్చేలా కొన్ని పోస్టులు కూడా పెట్టింది. అలా ఈ జంట విడిపోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు.
ఆ డైరెక్టర్ వల్లే నా…?
అయితే ఈ ప్రేమ పక్షులు విడిపోవడానికి కారణం… ఓ డైరెక్టర్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఓ సినిమా చేస్తుంది. ఈ క్రమంలో ఆ డైరెక్టర్ తో హీరోయిన్ చాలా క్లోజ్ గా ఉంటుందట. ఆ డైరెక్టర్ కూడా ఆమెను వదిలి ఉండటం లేదట. అలా… ఆ ప్రేమ పక్షల మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం.
ఎక్కడికి వెళ్లినా… పక్క రూంలోనే..?
సినిమా కోసం ఇతర లోకేషన్స్ కి వెళ్లినప్పుడు హోటల్స్ లో ఆ స్టార్ హీరోయిన్ పక్క రూం లోనే… ఆ డైరెక్టర్ ఉంటారట. అలా ముందే హోటల్స్ లో రూం బుక్ చేసి పెడుతారట. అది ఒక్కటే కాదు… ప్రతి సందర్భంలోనూ.. ఆ హీరోయిన్ ను డైరెక్టర్ వదిలి పెట్టకుండా.. పక్కనే ఉంటాడట.
ఇదింతా గమనించిన.. ఆ స్టార్ హీరోయిన్ లవర్.. హర్ట్ అయిపోయాడట. హీరోయిన్ తో దీని గురించి చర్చించినా.. ఫలితం లేకపోవడంతో… విడిపోవడమే బెటర్ అని అనుకున్నాడట. అలా ఇద్దరు విడిపోయారని తెలుస్తుంది.