Betting Apps Case : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ క్రమంలో చాలామంది పై కేసులు నమోదు చేశారు. ఇదే కాదు యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా పంపారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్కు హాజరయ్యి వివరణ ఇచ్చారు. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దీంతో పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసును ఇకమీదట పోలీసులు డీల్ చేయకుండా సిబిఐ కి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు సీరియస్ యాక్షన్..
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని సర్కార్ నిర్ణయం.. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నీ విచారించనున్న సీఐడీ.. హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు.. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు.. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. కొందరు సినీనటులను పిలిచి విచారించిన పోలీసులు.. ఈ యాప్స్ ను పూర్తిగా స్టడీ చేస్తారని తెలంగాణ సర్కార్ సిఐడి ని దింపాలని ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సిఐడి కి దిశా నిర్దేశం చేసారని తెలుస్తోంది. హైదరాబాదులో 11 మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు..
Also Read : యాంకర్ కు లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చిన మంచు మనోజ్.. దెబ్బకు తిక్కకుదిరిందిగా..
బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రేటీలు..
ఈజీగా డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటారు. అయితే కొన్ని మార్గాలు మాత్రమే అందుకు అనువుగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం అత్యాశకు పోయి కొన్ని రకాల యాప్లలో డబ్బులను పెడితే లాభాలు వస్తాయని ఆశపడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. లక్షలకు లక్షలు పెట్టి వాటిని తీర్చలేక అప్పుల పాలై ప్రాణాలను వదులుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ లో కేసు నడుస్తున్న కూడా ఇప్పటికీ కొంతమంది వాటిని గుడ్డిగా నమ్మి ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ యాప్ ల గురించి తెలిసి కూడా సెలబ్రిటీలు ప్రమోట్ చేసి అమాయకపు ప్రజలను అన్యాయం చేస్తున్నారంటూ కొందరు వాదన వినిపించడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. ఇటువంటి యాప్లను ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపారు. రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి వారి పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.. ఇప్పటికిరీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియా, యాంకర్ శ్యామల పొలుసులు ఎదుట విచారణకు హాజరయ్యారు..