BigTV English

Kenya Serial Killer: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

Kenya Serial Killer: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

Kenya Serial Killer: ఆఫ్రికా దేశం కెన్యాలో భయంకరమైన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు పట్టుకున్నారు. గత రెండేళ్లుగా ఆ సైకో కిల్లర్ 42 మంది మహిళలను చంపాడని పోలీసుల విచారణలో తేలింది. 2022లో మొదటిసారి తన భార్య హత్యలు చేయడం మొదలుపెట్టిన ఈ కిరాతకుడు జూలై 11, 2024న హత్య చేసిన తరువాత పోలీసులు అతడిని ఆదివారం జూలై 14 రాత్రి యూరో ఫుట్ బాల్ కప్ ఫైనల్ చూస్తుండగా అతడిని అరెస్టు చేశారు.


ఆ తరువాత పోలీసులకు ఆ నరహంతకుడి చేతిలో చనిపోయిన 9 మంది అమ్మాయిల శవాల భాగాలు సమీపంలోని ఒక క్వారీలో దొరికాయి. ఈ సంఘటన నైరోబీ నగరంలో కలకలం రేపింది. లోతున ఉన్న క్వారీలో అందరూ చెత్త వేస్తుంటారు. పైగా ఆ చెత్త సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉండడంతో క్వారీలో శవాలున్నట్లు ఎవరికీ అనుమానం రాలేదు. పోలీసుల విచారణలో 42 మంది మహిళలను తానే హత్య చేశానని జుమైసీ నేరాన్ని అంగీకరించిన తరువాత.. శవాలు ముక్కలుగా చేసి క్వారీలో పడేసి నట్లు తెలిపాడు. పోలీసులు అతడిని ఇంటి సోదా చేసిన తరువాత.. అతని ఇంట్లో ఒక గదిలో పెద్ద సైజు నైలాన్ సంచులు, కొడవలి ఆకరంలో ఉండే పెద్ద కత్తి, చేతులకు వేసుకునేందుకు ఇండస్ట్రియల్ గ్లోవ్స్ లభించాయి. ఇంకా చనిపోయిన మహిళల హ్యాండ్ బ్యాగులు, వాచీలు, చైన్‌లు, మొబైల్ ఫోన్లు లభించాయి.

Also Read: బొగ్గు గనిలో ముగ్గురు మృతి.. ఊపిరాడక చనిపోయిన కార్మికులు..!


హత్య చేసిన తరువాత చేతులకు గ్లోవ్స్ వేసుకొని కత్తితో శవాన్ని ముక్కలుగా నరికి నైలాన్ సంచులలో శవ భాగాలు నింపి.. ఆ తరువాత తన ఇంటికి సమీపం లో ఉన్న లోతైన క్వారీ లో ఉన్న చెత్తలో పడేసేవాడు.

 

హత్య వెనుక షాకింగ్ కారణం..
పోలీసుల కథనం ప్రకారం.. కెన్యా రాజధాని నైరోబి నగరంలోని ముకురు ప్రాంతంలో నివసించే 33 ఏళ్ల కొలిన్స్ జుమైసీ ఖలూషా వూ డూ తాంత్రిక పూజలు చేసేవాడు. క్షుద్ర శక్తులకు తన భార్యను బలి ఇవ్వడాని కోసమే 2022లో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తరువాత ఆమె శవంతో క్షుద్ర పూజల చేసి.. ఆ తరువాత శవాన్ని ముక్కలుగా నరికేసి.. శవభాగాలను క్వారీలో పడేశాడు. మహిళల శవాలతో క్షుద్ర శక్తులకు పూజలు చేస్తే.. తాను ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చునని జుమైసీ భావించాడట.

అలా మొదటిసారి హత్య చేసిన తరువాత జుమైసీకి మరింతమంది మహిళలను చంపాలని పించింది. ప్రతీసారీ ఒక మహిళను ఆకట్టుకోవడం ఆ తరువాత ఆమెతో కొంత కాలం సరదాగా గడపడం.. తన ఇంటికి తీసుకెళ్లి ఆమెను హత్య చేసి… ఆమె శవంతో క్షుద్రపూజలు చేసేవాడు. అనంతరం.. ఆమె శవాన్ని ముక్కలుగా చేసి పడేసేవాడు. కొన్నిసార్లు కన్యగా ఉండే మహిళలను శారీరకంగా అనుభవించే వాడు. అలా మొత్తం 42 మంది మహిళల ప్రాణాలు బలి తీసుకున్నాడు.

చనిపోయిన మహిళలు కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసులు చాలాకాలంగా మహిళల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. అనుకోకుండా ఒకరోజు మహిళ మొబైల్ ఫోన్ ట్రాక్ చేశారు. ఆ ఫోన్ ట్రాకింగ్ చేస్తూ.. ఒక పబ్ లోకి వెళ్లారు. అక్కడ జుమైసీ మరో మహిళతో ఉన్నాడు. అక్కడ పబ్ లో బీరు తాగుతూ.. టీవిలో యూరో ఫుట్ బాట్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఆ మహిళను కూడా ఆ రాత్రికి క్షుద్ర పూజ కోసం బలి ఇద్దామనుకున్నాడు. కానీ పోలీసులు అతడి ఫోన్ ట్రాక్ చేసి.. పట్టుకున్నారు.

Also Read: దారుణం.. ఊయలలో ఉన్న 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం..!

హత్యల వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం
కెన్యాలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. అయితే నిరసనలు చేసే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతున్నారు.. కానీ ఆ తరువాత ఆ నిరసనకారులు ఏమయ్యారో.. వారి ఆచూకీ తెలియడం లేదు. ముఖ్యంగా ఆ నిరసనకారుల్లో ఎక్కువగా మహిళలున్నారు. ఇప్పుడు జుమైసీ కేసులో దొరికిన శవాలు.. ఆ నిరసనకారులవేమోనని సామాజిక కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×