BigTV English

Karnataka Crime News: భర్తను వేధించిన భార్య, ఆపై సూసైడ్, ఏం జరిగింది?

Karnataka Crime News: భర్తను వేధించిన భార్య, ఆపై సూసైడ్, ఏం జరిగింది?

Karnataka Crime News: భార్యాభర్తలు అన్న తర్వాత కొన్ని విషయాలపై కూల్‌గా ఉండడమే బెటర్. నచ్చని దాని గురించి ఒకటీ లేదా రెండు సార్లు నవ్వుతూ అనుకోవడం సహజం. అదే కంటిన్యూ చేస్తే వేధింపులకు దారి తీస్తుంది. ఫలితంగా మనసు నొచ్చుకుంటుంది. దాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అలా వేధింపులకు గురిచేసింది అతడి భార్య. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


ఈ మధ్యకాలంలో చాలామందికి హెయిర్ ఊడిపోతుంది. విటమిన్లు లోపమా? టెన్షన్ వల్లా? పొల్యూషన్ సమస్యా? ఇలా ఏదైనా సమస్య కావచ్చు. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది. కాకపోతే కొందరికి దారుణంగా ఊడిపోతుంది. మరి కొందరికి అక్కడక్కడ ఊడిపోవచ్చు. హెయిర్ ఊడిపోవడం వల్ల భార్యకు కోపం వచ్చింది. తరచూ బట్టతలంటూ భర్తపై వేధింపులకు దిగేది.

అసలేం జరిగింది?


చివరకు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. పరమ శివమూర్తి  సొంతూరు కర్ణాటకలోని చామరాజనగర తాలూకాలోని ఉడిగాల ప్రాంతం. 32 ఏళ్లు వయసైన ఆయన, వృత్తి రీత్యా లారీ డ్రైవర్. రెండేళ్ల కిందట ఆయనకు మమతతో పెళ్లి జరిగింది. పెళ్లి నాటికే ఆయనకు కొంత బట్ట తల ఉంది.

ఆ తర్వాత లైట్‌గా హెయిర్ ఊడిపోవడం మొదలైంది. తన భర్త అందంగా ఉండాలని నిత్యం భావించేది మమత. కాకపోతే రోజురోజుకూ భర్త హెయిర్ లాస్ కావడం మొదలైంది. ఈ సమస్యపై ఇద్దరి మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకున్నాయి.

ALSO READ: వీరు కిలాడి లేడీ‌స్.. రూ.75 కోట్ల డ్రగ్స్‌తో బుక్కయ్యారు

ఇదే విషయమై రోజు రోజుకూ పలుమార్లు మమత ప్రస్తావించేది. దీంతో పరమ శివమూర్తి కోపం వచ్చేది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్య చేస్తున్న అవహేళనను తట్టుకోలేకపోయాడు. చివరకు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

పరమ శివమూర్తిపై కేసులు

అంతకుముందు పరమ శివమూర్తిపై గృహహింస, కట్నం వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. కొన్ని రోజులు జైలు జీవితం అనుభవించాడు ఆయన. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన పరమ శివమూర్తి, సోషల్‌ మీడియాలోని భార్య పెట్టిన సింగిల్‌ స్టేటస్‌ చూసి ఆవేదన చెందాడు.

జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు పరమ శివమూర్తి. దీనికి సంబంధించి రాసిన నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×