Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మ ప్రెగ్నెంట్ అనుకుని నిర్మల, శివరాం హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో మిస్సమ్మ కంగారుగా అసలు మీరెలా నన్ను ప్రెగ్నెంట్ అనుకుంటారు. అసలు మా మధ్య ఏం అని అపగానే.. మనోహరి రిలాక్స్ అవుతుంది. అమర్ సిగ్గుతో రాథోడ్ నేను బయట ఉంటాను పిల్లలను తీసుకునిరా అని చెప్పి వెళ్లిపోతాడు. నిర్మల కూడా ఒక్క నిమిషం నేను ఎంత ఆనంద పడ్డానో తెలుసా అంటుంది. ఇప్పుడు ఆ ఆనందాన్ని అబద్దం అని మనసుకు ఎలా సర్దిచెప్పుకోవాలో అంటుంది. దీంతో రాథోడ్ ఎందుకు మేడం అంతలా బాధపడతారు. ఈరోజు అబద్దం అయింది. ఎప్పుడో ఒక్కరోజు నిజం అవుతుంది కదా అంటాడు. దీంతో మిస్సమ్మ అవ్వొద్దని అనుకుంటున్నాను రాథోడ్ అని చెప్తుంది. అనామిక మాట వరుసకు కూడా అలా అనొద్దు మేడం అని చెప్తుంది.
దీంతో మిస్సమ్మ మాట వరుసకు అనలేదు అనామికగారు. మనస్పూర్తిగా అన్నాను. నాకు ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. అది చాలు అని చెప్తుంది. ఇంతలో శివరాం.. కానీ మిస్సమ్మ నీకు అమ్మ అవ్వాలని లేదా..? అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ నా పిల్లలకు నేను అమ్మనే కదా మామయ్యా.. నా కడుపున పుట్టకపోయి ఉండొచ్చు కానీ ఆయన నా మెడలో మూడు ముళ్లు వేసిన మరుక్షణం నేను అమ్మను అయిపోయాను. ఆయనతో పిల్లలతో ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు అని చెప్తుంది. దీంతో నిర్మల ఎమోషనల్‌గా సవతి తల్లి అమ్మ అవ్వలేదనే మాటను నువ్వు.. తప్పని రుజువు చేస్తున్నావు భాగీ. నువ్వు అమర్ జీవితంలోకి రావడం నిజంగా మా అదృష్టం అంటుంది. అందరి మాటలు డోర్ చాటు నుంచి వింటుంటాడు అమర్. అమర్ వినడం మనోహరి చూసి షాక్ అవుతుంది.
స్వామిజీ దగ్గరకు వెళ్లిన మనోహరి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు కానీ ఆ అనామికను ఇంట్లోంచి బయటకు పంపించలేకపోతున్నాను. ఇవాళ ఆ అనామిక నన్ను బెదిరించింది. ఇలానే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను అమర్‌కు శాశ్వతంగా దూరం చేస్తుంది. నా సమస్యకు ఒక సమాధానం ఇవ్వండి స్వామిజీ. అనామికను ఇంట్లోంచి పంపించడానికి నాకు ఒక మార్గాన్ని చూపించండి అని అడుగుతుంది. దీంతో స్వామిజీ నీ సమస్యే సరైనది కానప్పుడు నేను సమాధానం ఎలా ఇవ్వగలను మనోహరి అని చెప్తాడు. దీంతో మనోహరి అర్థం కాలేదు స్వామిజీ అని అడుగుతుంది. తప్పు జరుగుతుంది. నువ్వే వెతికే సమాధానంలో కాదు. నీ ప్రశ్నలోనే తప్పుంది. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? నీకున్న ప్రమాదం అరుంధతినా..? అనామికనా..? నువ్వు ఆ కుటుంబానికి దూరంగా పెట్టాల్సింది. అరుంధతినా..? అనామికనా..? అని అడగ్గానే..
మనోహరి అరుందతి అని చెప్తుంది. కానీ ఆత్మను ఆ శరీరం నుంచి వేరు చేయడం సాధ్యమేనా అని అడుగుతుంది. దీంతో స్వామిజీ సాధ్యమే రేపు పౌర్ణమి రోజు ఆత్మను ఆ శరీరం నుంచి వేరు చేయోచ్చు అని చెప్తాడు. అయితే ఏం చేయాలో చెప్పండి స్వామిజీ చేస్తాను అని అడుగుతుంది. ఏం చేయలో స్వామిజీ చెప్తాడు. దీంతో మనోహరి ధీమాగా రేపటితో అరుంధతి కథ ముగిస్తాను అనుకుంటూ వెళ్లిపోతుంది. వెనక నుంచి అంతా విన్న గుప్త ఈ స్వామిజీ చెప్పింది మనోహరి పాటించినచో.. బాలిక మళ్లీ ప్రమాదంలో పడుతుంది. జగన్నాథ ఏ పౌర్ణమి రోజు ఆ బాలికకు శక్తులు ఇచ్చావో అదే పౌర్ణమి రోజు బలహీనురాలిని చేస్తున్నావా..? జగన్నాథ ఆ బాలికకు నువ్వే అండ అయ్యా అని ప్రార్థిస్తాడు.
మరోవైపు అమర్‌ను మేజర్ పిలిచి సిటీలో బాంబ్ బ్లాస్ట్ లు జరిగే అవకావం ఉందని అందుకు సంబంధించిన ఫైల్స్ అమర్‌కు ఇస్తాడు. అటాక్‌లు ఎలా జరుగుతాయో తెలియదు. కానీ వాళ్లను మాత్రం ముందే ట్రేస్ చేయాలని చెప్తాడు. అమర్ సరే అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు మిస్సమ్మ తన ఫ్రెండుతో స్కూటీ మీద వెళ్తూ.. టెర్రిరిస్టుల కారునే గుద్దుతారు. కారులోని బాంబులు, తుపాకులు చూసి భయపడిపోతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?