Anakapalle Railway Track Incident: అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న ఓ లారీ విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళ్లూ సేఫ్టీ గడ్డర్ ను ఢీ కొట్టింది. బలంగా తగలడంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది. అదే సమయంలో ఓ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అయితే, ట్రాక్ పక్కకు జరిగి ఉన్న విషయాన్ని లోకో పైలెట్ గుర్తించాడు. వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.
రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన లోకో పైలెట్
అనకాపల్లిలో రైల్వే ట్రాక్ పక్కకు తప్పిన విషయాన్ని గూడ్స్ రైలు లోకో పైలెట్ రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. విశాఖ- విజయవాడ మార్గంలో నడిచే సుమారు 8 రైళ్లను ఆపేశారు. కశింకోట దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్, విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ఎలమంచిలి దగ్గర మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు సిబ్బంది పునరుద్దరిస్తున్నారు.
లోకో పైలెట్ అప్రమత్తతో తప్పిన పెను ముప్పు
లోకో పైలెట్ అప్రమత్త కారణంగానే అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పక్కకు తప్పడానికి ఆయన గుర్తించకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు గూడ్స్ ఖాళీగా వస్తోంది. స్పీడ్ కూడా తక్కువగానే ఉండటంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాడు. వెంటనే రైలును నిలిపివేశాడు. పెద్ద ప్రమాదాన్ని జరగకుండా కాపాడిన లోకో పైలెట్ ను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రమాదానికి కారణమైన లారీ గురించి పోలీసులు ఆరా
అనకాపల్లిలో రాళ్ల క్వారీలు ఎక్కువగా ఉంటాయి. పలు నిర్మాణ పనుల కోసం ఇక్కడి నుంచే రాళ్లు రవాణా చేస్తారు. నిత్యం ఈ ప్రాంతం నుంచి రాళ్లలో వందలాది లారీలు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటారు. తాజాగా క్వారీ రాళ్లతో వెళ్తున్న లారీ ఢీకొట్టడం వల్లే రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ఈ ప్రమాదానికి కారణం అయిన లారీ ఎవరిది? ఏ క్వారీ నుంచి వచ్చింది? లారీ డ్రైవర్ ఎవరు? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెను ప్రమాదం తప్పడంతో..
అటు రైల్వే బ్రిడ్జి కుంగినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై రైల్వే అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకవేళ లోకో పైలెట్ గమనించి ఉండకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. ఒకవేళ ఇక్కడ ప్రమాదం జరిగి ఉంటే.. చుట్టు పక్కల ఉన్న నివాసం ఉంటున్న వారు చాలా ఇబ్బందులు పడాల్సి ఉండేది. మొత్తంగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడం పట్ల రైల్వే అధికారులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: రైల్లో అందరూ చూస్తుండగానే పాస్ పోసిన ప్రయాణీకుడు, మరీ ఘోరం భయ్యా!
Read Also: సడెన్ గా ప్రయాణం క్యాన్సిల్ అయ్యిందా? ఇక టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు!