Mancherial Crime: నేటి సమాజంలో మనుషుల మధ్య నమ్మకం అనే పునాది కదులుతోంది. అనుమానం అనే ఒక చిన్న విత్తనం మనసులో నాటుకుంటే, అది మనిషిలోని విచక్షణను పూర్తిగా చంపేస్తుందని చెప్పడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం.
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన భార్యపై పెంచుకున్న లేనిపోని అనుమానంతో కనికరం లేకుండా ప్రవర్తించాడు. నలుగురు తిరిగే రోడ్డు అని కూడా చూడకుండా, సభ్య సమాజం తలదించుకునేలా ఆమెపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ అమానుషమైన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించిచాడు.
మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్, తన భార్య శిరీషతో కలిసి పట్టణంలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా రవి ప్రసాద్ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
అర్ధరాత్రి సమయంలో విపరీతంగా మద్యం సేవించిన రవి ప్రసాద్.. ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. గొడవ ముదరడంతో శిరీష ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగులు తీసింది. మద్యం మత్తులో ఉన్న రవి ప్రసాద్ అర్ధనగ్నంగా ఆమెను వెంబడించి రోడ్డుపైనే అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. అనుమానంతో ఆమెను చితకబాదుతూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి వేళ ఓ పోలీసు అధికారి ఇలా ప్రవర్తించడం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
బాధితురాలు శిరీష వెంటనే ఈ ఘటనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త తనను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక సహచర ఉద్యోగి, పైగా పోలీస్ శాఖలో ఉండి ఇలాంటి అసాంఘిక ప్రవర్తనకు పాల్పడటంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
Also Read: వైసీపీ ఒక ‘నకిలీ పార్టీ’.. జగన్ కుట్రలు సాగవు.. కేశినేని చిన్ని ఫైర్!
మంచిర్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన కానిస్టేబుల్ రవి ప్రసాద్
మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవి ప్రసాద్
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భార్య శిరీష
విచారణ చేపట్టిన పోలీసులు
Ravi prasad, a… pic.twitter.com/Qb5L7EKljp
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2026