E-Paper
Advertisement

Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు
Advertisement

Bandam Kunta: స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బంధం కుంట ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. వెంచర్ యాజమాన్యం బఫర్ జోన్‌ను ఆక్రమించి ప్రహరీ నిర్మించగా, మరో గోదాం నిర్మాణదారుడు ఏకంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వెళ్లినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కుంటకు నీరు వచ్చే నాలాలను కూడా పూడ్చివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమార్కుల ఇష్టారాజ్యం

ఎల్లంపేటలోని సర్వే నంబరు 45లో ఉన్న సుమారు ఎకరా 25 గుంటల బంధం కుంట అక్రమాల బారిన పడుతోంది. ఈ కుంటకు జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు కింద ఉన్న రెండు కల్వర్టుల ద్వారా నీరు వచ్చేది. ఇలా వచ్చిన నీరు బంధం కుంటలో చేరి, అధికమైతే సోమారం పరిధిలోని చింతల చెరువులోకి వెళ్లేది.అయితే ప్రస్తుతం ఈ సహజ నీటి ప్రవాహ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బంధం కుంట పక్కన చేపట్టిన వెంచర్ ప్రహరీ పూర్తిగా బఫర్ జోన్‌లోనే ఉందని, దానిని మట్టితో నింపినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు గ్రామ అవసరాలకు, మత్స్యకారుల జీవనాధారంగా ఉన్న ఈ కుంట వెంచర్లు, ఇతర నిర్మాణాల కారణంగా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉండగా, కుంటకు నీళ్లు రావడానికి, వచ్చిన నీళ్లు చింతల చెరువులోకి వెళ్లేందుకు ఉపయోగపడే నాలాను పూర్తిగా పూడ్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బఫర్ జోన్‌లో వెంచర్ కోసం ఏర్పాటు చేసిన ప్రహరీ పక్కన మొదట భారీ గుంత తవ్వి చేపలు పెంచారు.

Advertisement

Also Read: Ponnam Prabhakar: కేసీఆర్ తప్పు చేయకపోతే.. నిర్దోషి అని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం సవాల్.!

నిమ్మకు నీరెత్తినట్టు..

‘ఇది కుంట బఫర్ కాబట్టి ఎలాంటి నిర్మాణాలు చేపట్టం’ అన్నట్టుగా వ్యవహరించిన వెంచర్ యాజమాన్యం, కొద్ది రోజుల తర్వాత పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి ఆ గుంతను పూడ్చివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పుడు బంధం కుంట నుంచి పక్కనే ఉన్న చింతల చెరువులోకి నీళ్లు వెళ్లే నాలానే లేకుండా చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే వెంచర్ వ్యవహారానికి తోడు, దాని పైన ఉన్న 70.71 సర్వే నంబరులో చేపట్టిన గోదాం నిర్మాణం కూడా ఎఫ్‌టీఎల్‌లోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు రావడం లేదన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. పత్రికల్లో వార్తలు వస్తున్నా, స్థానికులు కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నీటి వనరుల పరిరక్షణ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులతో మిలాఖత్ అయి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ఇటు బంధం కుంట, అటు చింతల చెరువు ఉనికికి ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Saraswati Pushkaralu: సరస్వతి నదీ పుష్కరాల పై అధికారుల సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×