E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెళ్లయిన 40 రోజులకే నవ వధువు ఆత్మహత్య, విశాఖలో దారుణం, కృష్ణవేణి ఆఖరి కాల్ ఎవరికి?

పెళ్లయిన 40 రోజులకే నవ వధువు ఆత్మహత్య, విశాఖలో దారుణం, కృష్ణవేణి ఆఖరి కాల్ ఎవరికి?
Advertisement

Visakhapatnam: కారణాలు తెలీదు గానీ వివాహానికి ముందు, ఆ తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖలో పెళ్లైన 40 రోజులకే నవవధువు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె ఆఖరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లిందన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది?

విశాఖలో దారుణమైన ఘటన.. పెళ్లైన 40 రోజులకు నవవధువు ఆత్మహత్య

Advertisement

విశాఖ సిటీలోని పీఎంపాలెం ఆర్‌హెచ్‌ కాలనీలో బుధవారం రాత్రి నవవధువు కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మిత్తివలసకు చెందినది కృష్ణవేణి.  దగ్గర బంధువు మురళితో మే 13న పెళ్లి జరిగింది. 20 రోజుల కిందట పీఎం పాలెం ఆర్‌హెచ్‌ కాలనీలోని ఓ ఇంట్లో కాపురం పెట్టారు.

తొలుత మురళీ-కృష్ణవేణి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వివాహం జరిగిన 40 రోజులకు కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. గోపాలపట్నంలోని ఓ షాపులో మూడేళ్లుగా పని చేస్తోంది కృష్ణవేణి.  అక్కడ అనుకోని ఘటనలు ఏమైనా జరిగాయా? అక్కడి పరిణామాల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

Advertisement

పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు, మా అల్లుడు మంచోడు

ఈ నేపథ్యంలో కూతురు ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసుపు కుంకుమతో కూతురి ఇంటికి వెళ్లినప్పుడు అందరూ సంతోషంగా గడిపామని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. అల్లుడు మురళిపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. దీంతో కృష్ణవేణి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణవేణి ఆఖరి ఫోన్ కాల్ ఎవరికి చేసింది? అనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె ఆపిల్ ఫోన్ కావడంతో పోలీసులకు ఓపెన్ చేయడం కష్టంగా మారింది. సాంకేతిక అంశాలతో ఫోన్ కాల్ డేటాను తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెళ్ళికి ముందు కృష్ణవేణి హాస్టల్ లో ఉంటూ షాపులో పని చేసేది.

ALSO READ: లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి, మాచర్లలో ఘోర ప్రమాదం 

పెళ్ళికి ముందు కృష్ణవేణిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా? మొబైల్‌ను ఆధారాల కోసం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. ఫోన్ ఓపెన్ అయితే కాల్, ఛాటింగ్ వివరాలు బయటకు తెలుస్తాయని అంటున్నారు. కృష్ణవేణి-మురళి ఇంటి పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలన చేస్తున్నారు పోలీసులు.

Related News

లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి,మాచర్లలో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్‌కు

ATM Theft: ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసులో మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. తండ్రీ కొడుకుల స్కెచ్ కానీ..?

తల్లి ఆఫీసర్.. కొడుకు ఏజెంట్.. ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లపై సినిమా రేంజ్ మోసం!

హైకోర్టు ఎంట్రీతో సీన్ రివర్స్.. సాయికృష్ణ కేసులో సిట్ రిమాండ్ రిపోర్టులో వణికించే నిజాలు!

కేతన్ కేసు మరొక మలుపు.. హత్య వెనుక సియా ఏం చెప్పింది ఇదే, చేతన్ ఫ్యామిలీ ఏమంటోంది?

Nalgonda: నల్గొండ నాలుగు హత్యల కేసు మిస్టరీ.. ఇంటి వ్యక్తుల పనే, హత్యల వెనుక కూతురు-అల్లుడు

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలిబూడిదైన కారు

Big Stories

×