E-Paper
Advertisement

IRCTC Budget Tours: ఐఆర్సీటీసీ స్పెషల్ ఆఫర్, జస్ట్ రూ. 30 వేలల్లో క్రేజీ టూర్ ప్యాకేజీలు!

IRCTC Budget Tours: ఐఆర్సీటీసీ స్పెషల్ ఆఫర్, జస్ట్ రూ. 30 వేలల్లో క్రేజీ టూర్ ప్యాకేజీలు!
Advertisement

IRCTC March-End Tour Packages UnderRs.30,000: ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేలా సరికొత్త ప్యాకేజీలను ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే మార్చి ఎండింగ్ సందర్భంగా క్రేజీ టూర్ ప్యాకేజీలను పరిచయం చేసింది. ఈ టూర్ ప్యాకేజీలు మార్చి చివరి వరకు అందుబాటులో ఉంటాయి. మార్చి ముగిసేలోపు టూర్ ను ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్‌లో ఈ టూర్ ప్యాకేజీల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలలో అందించే సౌకర్యాలు, వాటి ధర ఎంత? యాత్ర ఎంత కాలం కొనసాగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

⦿ చండీగఢ్ నుంచి ప్రారంభమయ్యే టూర్ ప్యాకేజీ

ఈ టూర్ చండీగఢ్ నుంచి మార్చి 27న ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యాటకులు రాజస్థాన్‌ లోని అబూ రోడ్, ఉదయ్‌ పూర్, జోధ్‌ పూర్, అజ్మీర్‌ కు తీసుకువెళుతుంది. ఈ ప్యాకేజీ 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది.  ఈ యాత్ర మొత్తం రైల్లో కొనసాగుతుంది. సందర్శన స్థలాల కోసం క్యాబ్‌లు ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీని చండీగఢ్ To  రాజస్థాన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ ప్యాకేజీకి సంబంధించి ధరలను పరిశీలిస్తే.. సింగిల్ పర్సన్ ప్రయాణానికి ప్యాకేజీ ఛార్జ్ రూ. 39,245. కుటుంబంతో ప్రయాణిస్తే, ఈ ప్యాకేజీ మరింత చౌకగా లభిస్తుంది.  ఇద్దరు వెళ్తే ప్యాకేజీ ఫీజు ఒక్కొక్కరికి రూ. 28,650. ముగ్గురికి ప్యాకేజీ ఛార్జ్ ఒక్కొక్కరికి రూ. 26,730. పిల్లలకు ప్యాకేజీ ఛార్జ్ రూ.22,895.

⦿ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ

Advertisement

ఈ టూర్ ప్యాకేజీ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో ప్రారంభం అవుతుంది. పూణే, సోలాపూర్ లోనూ బోర్డింగ్ కావచ్చు. ఈ ప్యాకేజీలో హైదరాబాద్, ముంబైని సందర్శించుకోవచ్చు.  ఈ ప్యాకేజీ మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 రోజుల పాటు కొనసాగుతుంది.  ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం,  సందర్శన కోసం క్యాబ్‌లు అందిస్తారు.  ఈ ప్యాకేజీని ‘స్ప్లెండిడ్ హైదరాబాద్ విత్ రామోజీ ఎక్స్ ముంబై’ అని పిలుస్తారు. సింగిల్ టూరిస్టులు రూ. 39,245 చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తే, ఈ ప్యాకేజీ మరింత చౌకగా ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులకు ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.29,600. ముగ్గురు వ్యక్తులకు ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.17,199 ఉంటుంది. పిల్లలకు ప్యాకేజీ ఛార్జ్ రూ. 15,599 ఉంటుంది.

ఇక ఈ టూర్లకు సంబంధించిన టిక్కెట్లను ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్‌ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే రైల్ వన్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పరిమిత సంఖ్యలో టిక్కెట్లు ఉన్న నేపథ్యంలో టూరిస్టులు త్వరగా బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Advertisement

Read Also:  నవరాత్రి వేళ వైష్ణోదేవి దర్శనం.. IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×