E-Paper
Advertisement

ఖాకీకే గురి.. పట్టపగలే రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చైన్ స్నాచింగ్!

ఖాకీకే గురి.. పట్టపగలే రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చైన్ స్నాచింగ్!
Advertisement

Medchal: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంచలనమైన చైన్ స్నాచింగ్ ఘటన వెలుగుచూసింది. రాఘవేంద్ర నగర్ కాలనీలో నివసించే ఒక రిటైర్డ్ ఎస్‌ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్)ని టార్గెట్ చేస్తూ దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పట్టపగలే, అది కూడా శాంతిభద్రతలను కాపాడిన ఒక మాజీ పోలీసు అధికారిపైనే ఈ దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఎస్‌ఐ తన ఇంటి ముందు ఉన్న సమయంలో పల్సర్ బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు ఏదో ఒక అడ్రస్ వెతుకుతున్నట్లుగా నటిస్తూ, చాలా అమాయకంగా ఆయనను పలకరించి రూట్ అడిగారు. రిటైర్డ్ అధికారి వారికి చిరునామా వివరిస్తున్న క్రమంలో, ఒక్కసారిగా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఆయన మెడలోని రెండు తులాల బంగారు గొలుసును బలంగా లాగేసాడు. క్షణాల వ్యవధిలోనే బైక్ వేగం పెంచి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి బాధితుడు కోలుకునే లోపే దొంగలు కళ్లెదుట నుంచే మాయమయ్యారు.

Advertisement

బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం ఆ కాలనీతో పాటు చుట్టుపక్కల మార్గాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బైక్ నెంబర్, నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, ఈ ఘటనతో రాఘవేంద్ర నగర్ కాలనీవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలనీల్లో భద్రతను మరింత పెంచాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: హైదరాబాద్‌ వాన బీభత్సం.. సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. ఎక్కడికంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×