Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఆరేళ్ల అమాయక బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిందితుడు పరమేశ్ యాదవ్ జవహర్‌నగర్‌లో నివాసముంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2024లో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read: తక్కువ బడ్జెట్‌లో.. లేటెస్ట్ ఫోన్ కొనాలా? రూ.10వేలలోపు టాప్ మొబైల్స్
కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఈ కేసులో జవహర్‌నగర్ పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తీర్పు వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నారు.
Also Read: వాట్సాప్ స్టేటస్ క్వాలిటీ తగ్గుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో హెచ్‌డీ ఫోటోలు