Medipally Murder: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం క్షణికావేశం, మనస్పర్థలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అత్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అల్లుడే కాలయముడిగా మారి ఆమె మరణానికి కారణమయ్యాడు.
ప్రేమ వివాహం.. మనస్పర్థలే కారణమా?
చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్ చెందిన స్నేహిత్ (28) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. పెళ్లయినప్పటి నుండి వీరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 29న అత్తా అల్లుళ్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
హెల్మెట్‌తో దాడి..
ఆ రోజు అరుణను బైక్‌పై తీసుకెళ్తున్న సమయంలోనే స్నేహిత్ ఆమెతో గొడవకు దిగాడు. రన్నింగ్ బైక్‌పై ఉండగానే ఆగ్రహంతో ఊగిపోయిన అతడు, చేతిలో ఉన్న హెల్మెట్‌తో అత్త తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అరుణ బైక్‌పై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరుసటి రోజే ఆమె మృతి చెందింది.
డ్రామా ఆడాడు.. సీసీ కెమెరాకు దొరికిపోయాడు
అరుణ మరణాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్నేహిత్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెకు ఫిట్స్ రావడం వల్లే బైక్ పై నుంచి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు రంగు బయటపడింది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అతడే హెల్మెట్‌తో కొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read: జనాభా సునామీ.. భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందా? లేక నిరుద్యోగంలో మునిగిపోతుందా?
రన్నింగ్ బైక్ పై అత్త, అల్లుడి మధ్య గొడవ..హెల్మెట్‌తో అత్తను చంపిన అల్లుడు
అత్తను హెల్మెట్ తో కొట్టిన అల్లుడు..రన్నింగ్ బైక్ పై నుంచి పడ్డ అత్త
తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అత్తమ్మ ఫిట్స్‌తో కింద పడిందని నమ్మించే ప్రయత్నం..
సీసీ ఫుటేజీలో బయటపడ్డ… pic.twitter.com/GwPL0h8nxA— BIG TV Breaking News (@bigtvtelugu) May 2, 2026