హైదరాబాద్ శివారులోని ఓ డెయిరీ ఫామ్ లో రాత్రి పూట 5 ఆవులు మాయం అయ్యాయి. మామూలుగా తాళ్లు ఊడి బయటకు వెళ్లి పోయాయని భావించి యజమాని లైట్ తీసుకున్నాడు. అవే వస్తాయి అనుకున్నాడు. ఎంతకీ, ఆ ఆవులు రాకపోవడంతో ఆయనకు అనుమానం కలిగింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి షాక్ అయ్యాడు. దొంగలు ఓ కారులో ఆవులను తీసుకెళ్తున్నట్లు కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఫామ్ నుంచి తప్పిపోయిన ఆవులు
హైదరాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్ల సాయికుమార్ యాదవ్ అనే వ్యక్తి డెయిరీ ఫామ్ నడిపిస్తున్నారు. మార్చి 11న రాత్రి పూట తన ఫామ్ నుంచి 5 ఆవులు మిస్ అయ్యాయి. బహుశ మేత కోసం బయటకు వెళ్లిపోయాయి ఉంటాయి అనుకున్నాడు. మేసిన తర్వాత మళ్లీ వస్తాయని భావించాడు. కానీ, ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. ఆవులు ఎప్పుడు బయటకు వెళ్లినా అంతసేపు ఉండవు. ఈ రోజు ఏదో తేడాగా ఉందని భావించాడు. వెంటనే, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశాడు. అందులోని విజువల్స్ చూసి అసలు విషయం తెలిసిపోయింది.
ఇన్నో వాహనంలో ఆవుల దొంగతనం
ఆ రోజు రాత్రి తన డెయిరీ ఫామ్ సమీపంలో ఇన్నోవా కారు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోలో ఓ ఆవు ఆ కారు పక్కనే రోడ్డు మీద కూర్చొని ఉన్నది. అందులో నుంచి ఓ వ్యక్తి కారులో నుంచి దిగి వెనుక డోర్ ఓపెన్ చేసి ఆవుకు గడ్డి పెడుతూ వాహనంలోకి నెట్టడం కనిపించింది. తన ఆవులు దొంగతనం జరిగినట్లు గుర్తించిన యాదవ్, వెంటనే వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వెంటనే తన ఆవులను దొంగతనం చేసిన వారికి పట్టుకోవడంతో పాటు తన ఆవులను తిరిగి తెచ్చివ్వాలని పోలీసులను కోరాడు.
ప్రత్యేక పోలీసు బృందంతో గాలింపు
ఇక యాదవ్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు మొదలు పెట్టారు. పశువుల దొంగతనంలో పాల్గొన్న అనుమానిత వాహనం, వ్యక్తుల ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీలో దొరికిన ఆధారాలను బేస్ చేసుకుని దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకోవడంతో పాటు ఆవులను రికవరీ చేస్తామని వెల్లడించారు.
Read Also: తాంత్రిక పూజలు చేసి మరీ భర్తను బలి ఇచ్చిందా? నేవీ ఆఫీసర్ ఘటనలో మరో ట్విస్ట్!
చాలా కాలంగా పాల వ్యాపారం చేస్తున్న సాయి కుమార్
అడ్ల సాయికుమార్ యాదవ్ 10 ఆవులు, 50 గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నారు. తరచుగా ఆయన ఫామ్ నుంచి తాళ్లు విప్పుకుని పశువులు బయటకు వెళ్తుంటాయి. కడుపునిండా మేత మేసిన తర్వాత మళ్లీ తిరిగి వస్తాయి. కానీ, అలా బయటకు వెళ్లిన ఆవులను కొంత మంది దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వీటిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన నీచుడు, మరీ ఇంత ఘోరంగా తయారవుతున్నారేంటి భయ్యా?