Jr NTR: ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఒకప్పుడు పెద్దగా టెక్నాలజీ లేకపోయినా.. కేవలం నటనతో, కథాకథనాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవారు నటీనటులు. అందుకే అవి కల్ట్ క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయాయి. అలాంటి క్లాసిక్స్‌ను టచ్ చేసి ఇప్పుడు రీమేక్ చేయడానికి ప్రయత్నించినా.. కచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడం ఖాయమని అలనాటి నటులు అంటుంటారు. అయినా కూడా పలు సినిమాలు రీమేక్ బాటపట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా తన తాతయ్య నందమూరి తారక రామారావు నటించిన ఒక కల్ట్ క్లాసిక్ సినిమాపై జూనియర్ ఎన్‌టీఆర్ కన్నుపడినట్టు తెలుస్తోంది.
అదే కోరిక
నందమూరి ఫ్యామిలీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సీనియర్ ఎన్‌టీఆర్‌కే దక్కుతుంది. హీరోగా మాత్రమే కాదు రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ఎంతో సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పటికీ ఆయనను అభిమానించే వారు చాలామంది ఉన్నారు. ఆయన కుటుంబం నుండి మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్‌టీఆర్. తాతయ్య పేరుతోనే హీరో అయ్యాడు కాబట్టి తాతను సీనియర్ ఎన్‌టీఆర్, మనవడిని జూనియర్ ఎన్‌టీఆర్ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక యాక్టింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఈ ఇద్దరినీ పోలుస్తూనే ఉంటారు. అలాంటి జూనియర్ ఎన్‌టీఆర్ తాజాగా తన కోరికను బయటపెట్టాడు.
వారసత్వాన్ని నిలబెడతా
సీనియర్ ఎన్‌టీఆర్ (Sr NTR) తన కెరీర్‌లో ఎన్నో మైథలాజికల్ సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ‘యమగోల’ స్క్రిప్ట్‌లోనే కాస్త మార్పులు చేర్పులు చేసి ‘యమదొంగ’ పేరుతో తెరకెక్కిన సినిమాలో నటించాడు జూనియర్ ఎన్‌టీఆర్ (Jr NTR). అయితే తన తాతయ్య సినిమాను రీమేక్ చేసే ఆలోచన ఉందా అని తాజాగా తనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ఆయన సినిమాలను రీమేక్ చేయాలంటే నాకు సరైన దర్శకుడు, నిర్మాత దొరకాలి. మైథాలజీలో తాతయ్యకు గొప్ప పేరు ఉంది కాబట్టి ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలంటే దీనిని నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరైన అవకాశం దొరికినప్పుడు కచ్చితంగా చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు ఎన్‌టీఆర్.
Also Read: ఆ సినిమా ఫ్లాప్, ఒక్క రూపాయి కూడా తీసుకొని స్టార్ హీరో.. ఇప్పుడు ఇదే ట్రెండ్.!
భారీ లైనప్
మొత్తానికి తన తాతయ్య కల్ట్ క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచన ఎన్‌టీఆర్‌లో ఉన్నట్టు బయటపడింది. ఎన్‌టీఆర్ యాక్టింగ్‌పై, డైలాగ్ డెలివరీపై నమ్మకం ఉన్నా కూడా అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను టచ్ చేయకపోవడమే బెటర్ అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ చేతిలో ప్రెస్టీజియస్ లైనప్ ఉంది. ఈ ఏడాది ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. దాంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ‘దేవర 2’ కూడా ఎన్‌టీఆర్ ఖాతాలో ఉంది. తన చివరి సినిమా ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.