E-Paper
Advertisement

Minor Assault: గద్వాలలో ఘోరం.. 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రే*ప్

Minor Assault: గద్వాలలో ఘోరం.. 15 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రే*ప్
Advertisement

Minor Assault:  జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసులు పొంచి ఉన్నారనే చేదు నిజం మరోసారి నిరూపితమైంది. కేవలం 15 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

బాధిత బాలిక తన గమ్యస్థానానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు, ఆమెకు సహాయం చేస్తామనే వంకతో ‘లిఫ్ట్’ ఇస్తామని నమ్మబలికారు. పాపం వారి మాటలను నమ్మిన ఆ బాలిక బైక్ ఎక్కింది. అయితే.. వారు ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాల్సింది పోయి.. పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Advertisement

ఘాతుకానికి పాల్పడిన అనంతరం.. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని ఆ బాలికను తీవ్రంగా బెదిరించారు. ఆ తర్వాత నిందితులు ఆమెను ఒక పాఠశాల సమీపంలో వదిలేసి పరారయ్యారు. జరిగిన ఘోరంతో దిగ్భ్రాంతికి గురైన బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కఠినమైన సెక్షన్లను జోడించారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. గాలింపు చర్యల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Advertisement

ఈ ఘటన సమాజంలో మహిళలు, ముఖ్యంగా మైనర్ బాలికల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నిందితులను త్వరగా పట్టుకుని, బాధితురాలికి తక్షణ న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ’హరీష్ రావు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే!‘.. నాయిని ఘాటు వ్యాఖ్యలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×