BigTV English

Kalki 2898AD: ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ టైంలో వర్కౌట్ అవుతుందా..?

Kalki 2898AD: ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ టైంలో వర్కౌట్ అవుతుందా..?

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేందుకు మేకర్స్ కూడా తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.


ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్లు, ప్రభాస్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. ఇక ఇటీవలే ఈ మూవీలోని అమితాబ్ పాత్రని రివీల్ చేశారు. ఇందులో అమితాబ్ అశ్వద్దామాగా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్‌లో అమితాబ్ ఒంటి నిండా బట్టలు ధరించి కేవలం కళ్లు మాత్రమే కనిపించే విధంగా వీడియో కట్ చేశారు. ఈ వీడియోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఇందులో బడా నటీ నటులు నటిస్తున్నారు. కాబట్టి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేసినట్టే.. ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.


Also Read: ‘కల్కి 2898’ లో విజయ్ దేవరకొండ కన్ఫర్మ్.. సాక్ష్యం ఇదిగో..

విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇక ఇప్పుడేమో ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఇలా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అదే టైంలో ఇండియన్ 2, పుష్ప 2 మూవీలు రిలీజ్ కానున్నాయి. ఆ మూవీల మధ్యలోకి ఇప్పుడు కల్కి వచ్చి చేరింది. ఇండియన్ 2 మూవీ జూన్ 13న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యలో జూన్ 27న కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

అంతేకాకుండా ఆ టైంలో ఎలాంటి పండగలు, పబ్బాలు లేవు. అదీగాక సమ్మర్ సెలవులు పూర్తయి స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అయ్యే టైం. ఒక్క వీకెండ్ తప్ప ఇంకెలాంటి స్పెషల్ డేస్ లేవు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద మూవీని రిలీజ్ చేస్తే సక్సెస్ అవుతుందా?.. ఒకవేళ హిట్ టాక్ వచ్చిన వసూళ్లు వస్తాయా? అని కొందరు చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×