E-Paper
Advertisement

రోజంతా కొండపై కూర్చుంటాడు.. నెలకు రూ.8.5 లక్షలు సంపాదిస్తాడు?

రోజంతా కొండపై కూర్చుంటాడు.. నెలకు రూ.8.5 లక్షలు సంపాదిస్తాడు?
Advertisement

China’s Cloudscape Observer Job: సాధారణంగా ఉద్యోగం అంటే ఆఫీస్, కంప్యూటర్, ట్రాఫిక్, టైమ్‌కి వెళ్లడం.. ఇలా ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. కానీ, చైనాకు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్‌ జాబ్ చూస్తే, ఆశ్చర్యం కలగకమానదు. ఆయన ఉద్యోగం  పర్వతాలపై ఉండటం, మేఘాలను చూడటం, వాటిని వీడియోలు తీయడం. అంతేకాదు, ఈ పని చేసినందుకు అతడికి నెలకు సుమారు రూ.8.5 లక్షల జీతం వస్తోంది.

ఉద్యోగం పేరు.. క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్!

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌ లో ఉన్న ప్రముఖ లావోజున్ పర్వత పర్యాటక ప్రాంతం అధికారులు ఈ ప్రత్యేక ఉద్యోగాన్ని క్రియేట్ చేశారు. దీనికి ‘క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్’ అని పేరు పెట్టారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి 30 రోజుల పాటు పర్వతంపై ఉండి అక్కడ కనిపించే మేఘాలు, పొగమంచు, సూర్యోదయం, సూర్యాస్తమయం, పర్వత దృశ్యాలను కెమెరాలో బంధించాలి.  ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఈ పని చేసినందుకు నెలకు 60,000 యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.5 లక్షలు చెల్లిస్తారు. వసతి సదుపాయం కూడా కల్పిస్తారు.

3,500 మందికి పైగా పోటీ

Advertisement

ఈ జాబ్ ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వారం రోజుల్లోనే 3,500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు ప్రత్యేక హ్యాష్‌ ట్యాగ్‌ లతో వీడియోలను పంపించాల్సి వచ్చింది. వీడియో క్వాలిటీ, నెటిజన్ల స్పందన లాంటి  అంశాలను పరిశీలించి విజేతను ఎంపిక చేశారు. చివరకు హెనాన్‌ కు చెందిన 23 ఏళ్ల వ్లాగర్ లీ సిచెన్ ఈ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. అతను సోషల్ మీడియాలో @xiaozao అనే పేరుతో వీడియోలు చేస్తుంటాడు.

ఉదయం 5 గంటలకే పని మొదలు!

బయటకు చూస్తే ఈ ఉద్యోగం చాలా సులభంగా అనిపిస్తుంది. రోజంతా ప్రకృతిని చూస్తూ ఉండాలి కాబట్టి చాలామందికి ఇది నిజంగానే డ్రీమ్ జాబ్ లా అనిపించింది. కానీ, లీకి మాత్రం ఈ పని అంత ఈజీగా అనిపించలేదు. రోజు ఉదయం 5 గంటల నుంచే తన పని మొదలు పెట్టేవాడు. సూర్యోదయానికి ముందే కెమెరా తీసుకుని షూటింగ్ ప్రారంభించేవాడు. సూర్యాస్తమయం తర్వాత కూడా పని కొనసాగేది. రోజులో వేర్వేరు సమయాల్లో, వివిధ కోణాల్లో మేఘాలు, పొగమంచు, పర్వతాలు, కాంతులను చిత్రీకరించాల్సి వచ్చేది. అవసరమైనప్పుడు డ్రోన్‌ను కూడా ఉపయోగించాడు.

కొత్త స్కిల్స్ నేర్చుకుని మరీ..  

Advertisement

ఈ ఉద్యోగం ద్వారా లీకి డబ్బుతో పాటు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. వీడియో షూటింగ్, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్‌ తో పాటు డ్రోన్ ఆపరేట్ చేయడంలో కూడా నైపుణ్యం పెరిగింది. అయితే, ప్రతిరోజూ మంచి కంటెంట్ ఇవ్వాలనే ఒత్తిడి కూడా ఉండేది. మేఘాలను మనకు నచ్చినట్లు నియంత్రించలేం కదా. కొన్నిసార్లు వాతావరణం కారణంగా అనుకున్న దృశ్యాలు కనిపించకపోవడంతో షూటింగ్ కష్టంగా మారేది. నెల రోజుల ఉద్యోగం పూర్తయ్యే సమయానికి లీకి ఈ ఈ ఎక్స్ పీరియెన్స్ ఎంతో ప్రత్యేకంగా మారింది. మేఘాలను చూస్తూ జీతం తీసుకోవడం వినడానికి కలలా ఉన్నా.. దాని వెనుక కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత కూడా ఉందని లీ చెప్పుకొచ్చాడు.

Read Also: గుడిని చుట్టుకున్న చేప.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Tags

Related News

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

Big Stories

Advertisement
×