E-Paper
Advertisement

టీమిండియా క్రికెట‌ర్లు పీక‌ల‌దాకా తాగి, నాకు ఉపాధి లేకుండా చేశారు!

టీమిండియా క్రికెట‌ర్లు పీక‌ల‌దాకా తాగి, నాకు ఉపాధి లేకుండా చేశారు!
Advertisement

Praveen Kumar On Team India :  టీమిండియా క్రికెటర్ల పై మాజీ ఆటగాడు ప్రవీణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టులో ఉన్న ఒకప్పటి సీనియర్ క్రికెటర్లందరూ మద్యం తాగేవారని.. కానీ తనను మాత్రం అస్సలు తాగనివ్వకుండా కుట్రలు చేశారని ఫైర్ అయ్యారు. అంతేకాదు వాళ్లే పీకలదాకా తాగి, తనను తాగుబోతు చేశారని బాంబు పేల్చారు ప్రవీణ్ కుమార్. తనపై తాగుబోతు ముద్ర వేసి… ఐపీఎల్ టోర్నమెంట్లో ఉపాధి లేకుండా చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీమిండియా క్రికెట‌ర్లు పీక‌ల‌దాకా తాగి, నాకు ఉపాధి లేకుండా చేశారు!

టీమిండియా ఒకప్పటి స్టార్ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియం ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందుల్లో పడేసేవాడు. మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీలో ప్రవీణ్ కుమార్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అతడు జట్టుకు దూరమై ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ది లల్లన్ టాప్ యూట్యూబ్ ఛానల్ కు ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తినడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రవీణ్ కుమార్.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

టీమిండియాలో తాను ఉన్నప్పుడు సీనియర్ క్రికెటర్లందరూ మద్యం తాగకుండా ఆపేవారని మండిపడ్డారు. కానీ వాళ్లు మాత్రం పీకలదాకా తాగి.. రెచ్చిపోయేవారని ఆగ్రహించారు. తను డ్రెస్సింగ్ రూమ్, హోటల్, స్టేడియం దగ్గర ఇక్కడ కూడా బాటిల్ మూత తీసి తాగిన దాఖలాలు లేవు.. కానీ తనపై మాత్రం తాగుబోతు అనే ముద్ర వేశారని ఫైర్ అయ్యారు. ఎప్పుడో ఒకసారి తన వ్యక్తిగత ప్రదేశాలలో తాగితే, తప్పుగా చూపించారని మండిపడ్డారు. తనను దొంగలు చేసి… టీమిండియా క్రికెటర్లు మాత్రం బాగా తాగేవారని ఫైర్ అయ్యారు.

ఐపీఎల్ లో ఉపాధి లేకుండా చేశారు

Advertisement

టీమిండియాలో తాను కొనసాగినప్పుడు తాగుబోతు ముద్ర తనపై వేశారని సీనియర్ క్రికెటర్ల పై ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అది ఇప్పటి వరకు తనపై ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెగటివ్ ఇమేజ్ కారణంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ లో కూడా తనకు పెద్దగా అవకాశాలు రాలేదని వివరించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీతో పాటు తన సొంత ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు కానీ బౌలింగ్ లేదా మెంటర్ పదవి దక్కకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు.

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ సౌరవ్ గంగూలీ లాంటి లెజెండ్స్ ఎప్పుడూ కూడా తమను చిన్న పిల్లల లాగా చూసుకునేవారని గుర్తు చేశారు. తప్పిదాలు చేస్తే.. సెట్ చేసేవారని పేర్కొన్నారు. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సీనియర్ ఆటగాడి పేరు మాత్రం ప్రవీణ్ కుమార్ బయట పెట్టలేదు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Tags

Related News

ఇదెక్కడి మాస్ రా మామ.. బ్యాట్ కు తగలకుండానే సిక్సర్

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×