BigTV English

New Born Baby Murder: మంట కలుస్తున్న మానవత్వం.. బాత్రూమ్ లో బిడ్డను కని.. రోడ్డుపైకి విసిరేసిన తల్లి!

New Born Baby Murder: మంట కలుస్తున్న మానవత్వం.. బాత్రూమ్ లో బిడ్డను కని.. రోడ్డుపైకి విసిరేసిన తల్లి!

Mother Killed New Born Baby in Kochi: బాత్రూమ్ లో బిడ్డను ప్రసవించిన తల్లి.. ఆ బిడ్డను కవర్ లో చుట్టి రోడ్డుపైకి విసిరేసింది. కేరళలోని కొచ్చిలో జరిగిందీ దారుణ ఘటన. నవజాత శిశువును చంపి.. అపార్ట్ మెంట్ లోని 5వ అంతస్తు నుంచి విసిరేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు 23 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. పనంపిల్లి నగర్ ప్రాంతంలోని రోడ్డుపై ప్లాస్టిక్ కవరులో చుట్టి ఉన్న నవజాత శిశువు మృతి చెందింది. నగర పరిశుభ్రత కార్మికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదరు మహిళ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా శిశువును రహస్యంగా చంపేందుకు ప్రయత్నించింది. పెళ్లికాకుండానే గర్భం దాల్చిన మహిళ.. తన తల్లిదండ్రులకు చెప్పకుండా..శిశువును ప్రసవించి.. ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డుపై పడేసిందని పోలీసులు తెలిపారు. శిశువు తలకు, దిగువ దవడకు గాయాలు కావడంతో మరణించినట్లు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు.

Also Read: ఐదేళ్లుగా డేటింగ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య


ప్రస్తుతం ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమెను జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేరళ రాష్ట్ర కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ ను కోరింది.

పసికందులను కాపాడుకోలేకపోతే చంపడం వంటి దుశ్చర్యలకు ఎవరూ పాల్పడవద్దని బాలల రక్షణ హక్కుల కమిషన్ చైర్మన్ కేవీ మనోజ్ కుమార్ అన్నారు. అమ్మతొట్టి, చిల్డ్రన్స్‌హోమ్‌తో పాటు వారిని రక్షించేందుకు అనేక ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయని, వారు అక్కడ సురక్షితంగా పెరుగుతారని ఆయన అన్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×