BigTV English

Madhya Pradesh Crime : ఐదేళ్లుగా డేటింగ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Madhya Pradesh Crime : ఐదేళ్లుగా డేటింగ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Women suicide news in MP(Telugu news live today): ఐదేళ్లుగా ప్రేమించి.. డేటింగ్ చేస్తున్న వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జునైద్ అనే వ్యక్తి, మహిళ కాలేజీలో చదువుకునేప్పటి నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ ఏకాంతంగా ఉండేందుకు తరచూ హోటల్ కు వెళ్లేవారు. ఐదేళ్లుగా ఇదే జరుగుతోంది.


జునైద్ తో ప్రేమలో ఉన్న మహిళ.. తనను పెళ్లాడుతాడని భావించింది. ఎప్పటిలాగే ఏప్రిల్ 28న ధార్ లోని ఒక హోటల్ కు వెళ్లారు. మహిళను అక్కడే ఉంచి.. జునైద్ ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. వెంటనే తలుపు మూసేసిన మహిళ.. ఎంతసేపటికీ తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూసేసరికి.. మహిళ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

Also Read : కర్నాటకలో యువతి దారుణ హత్య.. లవ్ జిహాద్ కారణమా?


మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. జునైద్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను విచారణలో చెప్పినదానిని బట్టి.. ఆమెను పెళ్లాడేందుకు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను రిట్రీట్ చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నువ్వు తక్కువ కులానికి చెందినదానివంటూ దూషించినట్లు పోలీసులు తెలిపారు. జునైద్ ను అరెస్ట్ చేసి.. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 376(రేప్) కింద కేసు నమోదు చేశారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×