Big Stories

Shock to Minister Roja: రోజాకు ఊహించని కష్టాలు.. అటు ప్రజల తిరస్కారం, ఇటు సొంత పార్టీ నేతలు.. కొత్తగా భర్త..

Big Shock to Minister Roja: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి రోజా అంటే తెలియనివారు ఉండరు. మాటలే ఆమెకు ఆయుధం. తన మాటలతో ప్రత్యర్థులను ఇరుకునపెడతారు. అంతేకాదు ఒక్కోసారి ఆమె కూడా ఇరుకున పడిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా మంత్రి రోజాకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకవైపు నియోజకవర్గంలో ప్రజల నుంచి.. మరోవైపు తన భర్త నుంచి సమస్యలు.. ఈ రెండింటికి మధ్య చిక్కి గిలగిలకొట్టుకుంటున్నారు. అసలేం జరిగింది..?

- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే వాళ్లలో మంత్రి రోజా ముందు ఉంటారు. రెండుసార్లు నగరి నుంచి గెలిచిన ఈమె, హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. ఈసారి అన్నివైపుల నుంచి సమస్యలు రెట్టింపయ్యాయి. చివరకు ప్రచారంలోనూ ఆమెకు నిరసనలు ఎదురవుతున్నాయి. తన నియోజకవర్గంలోని వడమాటలపేటలో మంత్రి రోజా శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె కాన్వాయ్‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

- Advertisement -

తమ గ్రామానికి ఏం చేశారని, ఇక్కడ ఓట్ల అడగడానికి ఎందుకొచ్చారని మంత్రి రోజాను ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు- గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో ప్రచారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై మంత్రి రోజా సీరియస్‌గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. కావాలనే టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులతో కుమ్మక్కు అయి తన ప్రచారాన్ని అడ్డుకున్నారన్నది ఆమె చెబుతున్నమాట.

Also Read: Kadapa Postal Voting : పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేత.. టీడీపీ సీరియస్

People shock to minister roja campaign at Nagari constitunecy
People shock to minister roja campaign at Nagari constitunecy

మరోవైపు కూటమి నేతల వైపు ప్రచారం చేస్తున్న కమెడియన్ పృథ్వీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జబర్దస్త్ షోలో అవకాశాల కోసం తిరిగిన రోజాకు వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారాయన. రోజా తన తప్పులు తాను తెలుసుకోవడం లేదన్నారు. రోజా టార్చర్ పడలేక ఆమె భర్త కూడా చెన్నైలో ఉన్నారంటూ భీమవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు నటుడు పృథ్వీ. కమెడియన్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదుగానీ దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి మంత్రి రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అల్లాడుతున్న ప్రజలు

నగరి నియోజకవర్గం విషయానికొస్తే.. మంత్రి రోజా వ్యవహారశైలి నచ్చక సొంతపార్టీ నేతలు టీడీపీ వైపు వెళ్లిపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్ పార్టీకి రాంరాం చెప్పేశారు.
శ్రీశైలం టెంపుల్ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాల పేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు నగరి నుంచి గెలుపొందని ఆమెకు ఈసారి కష్టమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నా రు. గత ఎన్నికల్లో కేవలం 2,700 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌పై రోజా గెలిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News