Big Stories

CM Revanth Reddy Mass Warning: హరీశ్‌రావు గుర్తుపెట్టుకో.. సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను తీసుకొస్తా: సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Reddy Mass Warning to Harish Rao : దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావుడీ నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో నేతలు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేతలు ప్రసంగిస్తున్నారు.

- Advertisement -

తాజాగా సీఎం రేవంత్ సిద్ధిపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో పైరయ్యారు. మెదక్ లో దొరల గడీలను బద్దలుకొడతాం.. మామ అల్లుళ్లు సిద్ధిపేటను 45 ఏళ్లుగా పాపాల భైరవుల్లా పట్టిపీడిస్తున్నారు.. ఈ మామ అల్లుళ్ల నుంచి సిద్ధిపేటకు విముక్తి కల్పిస్తాం.. అందుకే తాను ఇక్కడి వచ్చానని అన్నారు. అదేవిధంగా హరీశ్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో ఆగుస్టు 15 లోగా పక్కాగా రుణమాఫీ చేస్తా.. సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను తీసుకొస్తా అంటూ సీఎం రేవంత్ అన్నారు. ఆరునూరైనా ఈసారి మాత్రం మెదక్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు.

- Advertisement -

Also Read: రిజర్వేషన్లు ఎత్తివేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే శాశ్వత బానిసత్వం వస్తుంది.. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అక్రమంగా ఫాంహౌస్ లు కట్టుకున్నోళ్లు కావాలా..? లేక మంచి చేసే నేతలు కావాలో అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కరీంనగర్ కు చెందిన వ్యక్తిని మెదక్ అభ్యర్థిగా నిలబెట్టారని.. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగనో.. కేసీఆర్ వద్ద కూడా వెంకట్రామిరెడ్డి అలాగే అని అన్నారు. నీలం మధును లక్షకు పైగా మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు.

అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా ప్రసంగిస్తూ.. గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆదిలాబాద్ ను పట్టించుకోలేదన్నారు. వైద్యం, విద్య, ఉపాధికి సంబంధించి ఇక్కడా ఎలాంటి మార్పు జరగలేదన్నారు. ఆదిలాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆత్రం సుగుణను ఎంపీగా భారీగా మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Also Read: Tamilisai: కవిత ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..? : తమిళి సై

ఇటు బీజేపీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత డిసెంబర్ లో కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ చెప్పారని, మేలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మోదీకి బాయ్ బాయ్ చెప్పాలని రేవంత్ అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేసి మోదీ రైతులను పొట్టనపెట్టుకున్నారన్నారు. తనపై తాజాగా కేసులు పెట్టించారని, అలాంటి కేసులకు తాను భయపడబోనని, ఢిల్లీ సుల్తాన్లను సైతం ఎదురించే శక్తి తమకు ఉందని ఆయన పేర్కొన్న విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News