BigTV English

Daughter In Law Prostitution : కోడలి చేత వ్యభిచారం.. మానసిక రోగిగా మిగిలిన బాధితురాలు

Daughter In Law Prostitution : కోడలి చేత వ్యభిచారం.. మానసిక రోగిగా మిగిలిన బాధితురాలు

Daughter In Law Prostitution | చిన్న వయస్సులో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఓ 17 ఏళ్ల బాలిక ప్రేమ పేరుతో మోసపోయి, చివరకు వ్యభిచార మాఫియా చేతుల్లో నరకం అనుభవించాల్సి వచ్చింది. ఉలుకూ పలుకూ లేకుండా, కాళ్లు చేతులు వంకర్లు తిరిగి, అచేతనంగా పడిపోయి ఆ బాలిక ప్రస్తుతం మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘోర ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది.


పెద్దాపురం.. ఎన్టీఆర్ కాలనీలో నివసించే చందు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆ బాలిక వెంట పడ్డాడు. అతని మాయమాటలు నమ్మిన ఆమె తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని విడిచి అతనితో వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులందరూ ఆమె కోసం ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనుగొనలేక, చివరకు పోలీసులను ఆశ్రయించారు. కానీ బాలికను కనుగొన్న పోలీసులు, ఇరు కుటుంబాలను రాజీ కుదిర్చారు. చందుతో ఆమె వివాహం జరిగినట్టు తెలియడంతో, చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు బాలికను ఆమె అత్తింటికి పంపించారు.

కానీ అక్కడే అసలు నరకం మొదలైంది. అత్తింటి వారు కొన్ని రోజుల్లోనే అసలు స్వరూపంలోకి వచ్చారు. అత్త నీలిమ డబ్బు కోసం బాలికను వ్యభిచారంలోకి నెట్టి, అంగీకరించకపోతే తీవ్రంగా హింసించింది. బలవంతంగా మందులు ఇచ్చి, ఆమె శరీరాన్ని పూర్తిగా క్షీణింపచేసింది. బాలిక నాడీ వేగంగా దిగజారిపోవడంతో, గతేడాది డిసెంబర్ 28న కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రి‌లో చేర్పించారు. ఆసుపత్రి సమాచారం అందినా, పెద్దాపురం పోలీసులు స్పందించ లేదనే ఆరోపణలు ఉన్నాయి.


చివరకు బాలిక గురించి ఆమె తల్లిదండ్రుల సమాచారం తెలుసుకొని బాలిక వద్దకు చేరగా.. అక్కడ ఆమె ఒక నిర్జీవంగా పడి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందు శవంలా పడి ఉండడం చూసి చలించిపోయారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించినా, పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నెల 20న విశాఖ విమ్స్‌కు తరలించి, మానసిక వైద్యశాలలో చేర్పించారు. బాలిక మానసిక స్థితి గురించి చివరికి తల్లిదండ్రులు పెద్దాపురం పోలీసు ఉన్నతాధికారులతో ఫిర్యాదు చేశారు. దీంతో కదిలిన పోలీస్ యంత్రాంగం జనవరి 26న కేసు నమోదు చేశారు.

Also Read:  నిద్రపోతున్న భర్తకు నిప్పంటించిన భార్య.. ఆత్మహత్య అంటూ ప్రచారం.. ఎలా తెలిసిందంటే?

హనుమకొండలో విషాదం: కూతురి ప్రియుడి గొంతుకోసిన తండ్రి

హనుమకొండలో మరో విషాదకర ఘటన జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుడిని ఓ 17 ఏళ్ల బాలిక ఇంటికి పిలిచింది. కానీ ఆకస్మికంగా అక్కడికి బాలిక తండ్రి రావడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ ప్రియుడిపై బాలిక తండ్రి కత్తితో దాడి చేశాడని బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండలో మంగళవారం జనవరి 28 సాయంత్రం జరిగింది.

కేయా పోలీసుల కథనం ప్రకారం.. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల బాలిక, వరంగల్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడిని ప్రేమించింది. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అతడిని బాలికే పిలిచింది. బాలిక తండ్రి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలోనే బాలిక తండ్రి ఇంటికొచ్చాడు. అక్కడ కూతురి ప్రియుడి గురించి తెలిసి పట్టరాని కోపంతో రగిలిపోయాడు. బాలుడిపై దాడి చేశాడు. ఈ క్రమంలోని ఇంట్ ఉన్న కత్తితో అతని గొంతుకోశాడు. భయంతో బాలుడు బయటికి పరుగెత్తాడు. రక్తమోడుతూ ఆ బాలుడిని ఆ బాలిక తండ్రి వెంబడించాడు.

ఆందోళన చెందిన బాలిక గదిలో గడియ పెట్టుకుంది. ఆ సమయంలో తండ్రి తనను కూడా చంపేస్తాడని భావించి తనే ఉరివేసుకుంది. ఈ పరిణామాలు చూసి ఇరుగుపొరుగు వారు ఇంట్లో ఏం జరిగిందని వెళ్లగా ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. కాసేపు తరువాత బాలిక తండ్రి ఇంటి వద్దకు వచ్చి ఎంత ప్రయత్నించినా ఆమె తలుపులు తీయలేదు. దీంతో ఆమె తండ్రి తలుపులు పగులగొల్లి లొపలి వెళ్లి చూడా.. ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. బయట ఆ బాలుడిని కొందరు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆ బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కేయూ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×