BigTV English

Immanuel – Varsha: బయటపడ్డ పాత బంధాలు.. ఇద్దరి మధ్య బ్రేకప్ తప్పదా..?

Immanuel – Varsha: బయటపడ్డ పాత బంధాలు.. ఇద్దరి మధ్య బ్రేకప్ తప్పదా..?

Immanuel – Varsha:ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో గత దశాబ్ద కాలానికి పైగా తెలుగువారిని నవ్వుల్లో ముంచేత్తుతూ అలరిస్తున్న ఏకైక మెగా కామెడీ షో జబర్దస్త్ (Jabardast). సంవత్సరాలు గడుస్తున్నా..ఈ షోకి మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ముఖ్యంగా కంటెస్టెంట్స్, యాంకర్లు, జడ్జిలు అందరూ మారిపోయినా జబర్దస్త్ ఇప్పటికీ కామెడీ షో గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ తో దూసుకెళ్తున్న ఈ షో నుండి ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎంతోమంది ఈ షో ద్వారా ప్రతిభావంతులు తమ ప్రతిభను నిరూపించుకొని వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అందులో భాగంగానే కొంతమంది హీరోలుగా, మరి కొంతమంది దర్శకులుగా, ఇంకొంతమంది నిర్మాతలుగా మారి సత్తా చాటుతున్నారు.


జబర్దస్త్ ప్రోమో వైరల్..

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ షో నుండి ఈవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ (Immanuel) వర్షా(Varsha) మధ్య ప్రేమ బంధం ముగిసిపోయింది అన్నట్టు చూపించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రారంభంలోనే నూకరాజు (Nukaraju), తాగుబోతు రమేష్ (Tagubothu Ramesh) తమ స్కిట్ తో వస్తారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, నెలకు రూ.40,000 జీతం అని, తన కంపెనీలో చేయమని రమేష్ చెప్పగా..” సాఫ్ట్వేర్ ఇంజనీర్, దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేనని.. ఎప్పుడు పడిపోతాయో తెలియదంటూ ” నూకరాజు పంచ్ విసురుతాడు. ఆ తర్వాత పటాస్ ఫైమా తన టీం తో వచ్చి సందడి చేసింది. టీమ్ తో టీ తెండ్రా అని అడగగా.. టీ అంటే క్యాపిటల్ టీ నా లేక స్మాల్ టీనా అని అతడు అడిగితే చెంప పగలగొట్టింది . ఇక బుల్లెట్ భాస్కర్ ని నేను నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఫైమా వేధించగా నేను చేసుకోనని చెబుతాడు భాస్కర్. ఆ తర్వాత ఫైమా అనుచరులు మా అక్కని పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామని కత్తితో బెదిరించగా.. ఫైమా వచ్చి బావ అమాయకుడని, ఏం అనొద్దని చెబుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఈ ట్రైన్ పట్టాలెక్కదని, సైకిల్ ఒకేగాని బెల్ కొట్టలేదని చెప్పడంతో అందరూ నవ్వేశారు.


తమ స్కిట్ తో ఆకట్టుకున్న ఇమ్మాన్యుయేల్ – వర్ష..

ఇక ఆ తర్వాత మేమిద్దరం మొగుడు పెళ్ళాలమని వర్షా, ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చారు. నీతో స్కిట్ చేస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఉందని వర్షా అంటుంది. నువ్వు కొత్త కొత్త రుచులు మరిగాక.. మాతో చేయాలంటే కొత్తగానే ఉంటుందంటూ ఇమ్మానుయేల్ పంచ్ వేశాడు. ఇద్దరు పెళ్లికి ముందు ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. శివాజీ రోజు పాలకు వెళ్తున్నా.. ఆయన కట్టుకున్న చిన్న టవల్ ను కూడా ఏ రోజు చూడలేదని అంటుంది వర్ష. ఇక్కడ నిప్పుల గుండం పెడితే పతివ్రతలా లేచొస్తానని వర్షా చెప్పగా.. ఒసేయ్ కాలిపోతావే అంటూ రష్మీ కూడా పంచ్ వేస్తుంది. అలా మొత్తానికైతే ఈ ప్రోమోలో వర్ష ఇమ్మానుయేల్ స్కిట్ ని హైలెట్ చేస్తూ చూపించడం జరిగింది. ఏది ఏమైనా వీరిద్దరూ చేసిన స్కిట్ కి ఆడియన్స్ పడి పడి నవ్వగా.. మరికొంతమంది నిజ జీవితాన్ని వీళ్ళు స్కిట్ గా చేస్తున్నారు పాత బంధాలను గుర్తుచేసుకొని విడిపోతారేమో అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×