BigTV English

One Side Love: టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన స్టూడెంట్.. కారణం తెలిసి అంతా షాక్

One Side Love: టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన స్టూడెంట్.. కారణం తెలిసి అంతా షాక్

One Side Love: గురువు దైవంతో సమానం అంటారు. గురువు చెప్పిన పాఠాలు నేర్చుకుని మంచి విద్యార్థిగా ఎదగాల్సిన పిల్లలే ఇప్పుడు గురువులనే ప్రేమించే స్థాయికి ఎదుగుతున్నారు. అక్కడితో ఆగలేదు, తల్లి లాంటి టీచర్‌ను ప్రేమించి, చివరికి ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడికి పాల్పడింది 18 ఏళ్ల విద్యార్థి. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది.


పోలీసుల సమాచారం ప్రకారం.. నర్సింగ్పూర్ జిల్లాలోని కోట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎక్సలెన్స్ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు సూర్యవంశ్ కొచార్ (18).. ఈ పాఠశాలలోనే చదివాడు. కానీ కొద్దిరోజుల క్రితమే సూర్యవంశ్‌ను పాఠశాల నుండి తొలగించారు. ప్రస్తుతం వేరే స్కూల్‌లో చదువుతున్నాడు. గతంలో టీచర్ ఇచ్చిన ఫిర్యాదు పట్ల ఆగ్రహంతోనే ఈ దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో టీచర్ సారీ ధరించి రావడంతో నిందితుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంపై టీచర్ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కారణంగానే అతని మీద చర్యలు తీసుకున్నారు. దాంతో టీచర్‌పై వ్యక్తిగత పగ పెంచుకున్నాడు.

Also Read: Meenakshi Chaudhary: జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న మీనాక్షి.. ఫోటోలు వైరల్!


సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో.. నిందితుడు ఒక పెట్రోల్ సీసా పట్టుకొని టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమెతో మంచిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసాడు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కళ్లు తెరచి చూసేసరికి నిమిషాల్లోనే నిప్పు అంటించి, వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో బాధిత టీచర్‌కు సుమారు 10 నుంచి 15 శాతం వరకు కాలిన గాయాలు అయ్యాయి. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నా, ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నిందితుడు టీచర్ పై నిప్పు పెట్టడానికి గల కారణం ఫిర్యాదు కారణంగా కాదని, టీచర్ పై ప్రేమ పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆమెపై ఆకర్షణ పెరిగింది. ఆమెతో సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించడంతో టీచర్ తిరస్కరించింది.

దీంతో టీచర్ పై అతనిలో ప్రతీకార భావం పెరిగిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దానికి తోడు టీచర్ స్కూల్‌కు సారీ కట్టుకుని రావడంతో అలా చూసిన విద్యార్థి మాటలతో వేధించాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేసి, స్కూల్ నుంచి పంపించి వేయడంతో ఆమెపై ఇంకా పగ పెంచుకుని దాడి చేశాడని పోలీసుల వద్ద నిందితుడు అంగీకరించాడని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కోట్వాలి పోలీసులు కదిలారు. డోంగర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో నిందితున్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు. విద్యార్థిపై 124ఏ సెక్షన్ కింత కేసు నమోదు చేశామన్నారు. కేసును తీవ్రంగా విచారిస్తున్నామని, బాధితురాలి పూర్తి వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Related News

Gadwal Tragedy: విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు

Delhi News: భార్యను చంపి.. ‘దృశ్యం’ కథ అల్లేసిన భర్త, చివరికి ఇలా దొరికిపోయాడు!

Fatehpur robbery: మీటర్ చెక్ చేయాలన్నాడు.. మొత్తం దోచుకెళ్లాడు.. అలర్ట్ గా ఉండాల్సిందే!

Kukatpally Girl Incident: కూకట్‌పల్లి బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. చంపింది ఎవరంటే! సహస్ర తండ్రి సంచలన నిజాలు..

Bandlaguda Incident: మరో ప్రమాదం.. బండ్లగూడలో కరెంట్ షాక్‌ తగిలి ఇద్దరు వ్యక్తులు

Big Stories

×