BigTV English

Murdered in Shadnagar: షాద్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో రియల్టర్‌ దారుణహత్య..బాడీగార్డుపై అనుమానం!

Murdered in Shadnagar: షాద్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో రియల్టర్‌ దారుణహత్య..బాడీగార్డుపై అనుమానం!

Realtor brutally killed in farmhouse in Shadnagar: హైదరాబాద్ శివారులో ఓ బడా రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను రంగారెడ్డి జిల్లాలోని కేకే ఫామ్ హౌస్‌లో దుండుగులు హత్య చేశారు. షాద్‌నగర్‌లోని తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కొంతమంది గుర్తుతెలియని దుండుగులు కత్తులతో దాడిచేసి అతి కిరాతంగా నరికి చంపారు.


బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షా కోట్‌కు చెందిన కమ్మరి కృష్ణ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, కన్వెన్షన్ సెంటర్లతోపాటు ఫామ్ హౌస్‌లను నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఆ ప్రాంతంలో కేకేగా గుర్తింపు పొందాడు. అయితే ఆయనను షాద్‌నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న త సొంత కేకే ఫామ్‌ హౌస్‌లో ఉండగా.. దుండగులు రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

దుండుగులు కేకేను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు లేదా భూ తగాదాలా లేక ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత వ్యవహారాల అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


Also Read: దారుణం.. దుబాయ్‌లో భారతీయుడిని చంపిన పాకిస్థానీయులు

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మదనం గ్రామ సమీపంలో ఉన్న కేకే ఫామ్ హౌస్‌లో కమ్మరి కృష్ణను దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రంగస్వామి మీడియాతో మాట్లాడారు. రియల్టర్ కృష్ణను అతడి బాడీగార్డు బాబా హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ తెలిపారు.

Tags

Related News

Anantapur Crime: గర్భిణి ఆత్మహత్య.. వారి పేర్లు చెబుతూ వాయిస్ రికార్డు.. అడ్డంగా బుక్కైన పోలీసులు

Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Srikakulam Crime: వాట్సాప్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్.. తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడిని పిలిచి.. భర్త హత్య

Jadcherla Incident: లారీని ఢీ కొన్న బస్సు .. స్పాట్‌లో కూకట్‌పల్లి వాసులు

Hyderabad News: హైదరాబాద్‌లో పాక్ యువకుడి రాసలీలలు.. భార్యకి చిక్కాడు, అసలు స్కెచ్ అదేనా?

Big Stories

×