Big Stories

Gladiator 2| 24 ఏళ్ల తరువాత హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్!.. ట్రైలర్ అదరహో.. కానీ నెటిజెన్లు?

Gladiator 2| గ్లాడియేటర్.. ఈ సినిమా రెండు దశాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రోమన్ సామ్రాజ్యం, అప్పటి ఆటవిక పోరాట దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించిన అద్భుత కళాఖండం ఇది. ఈ సినిమా ఏకంగా 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు కూడా దక్కాయి. దాదాపు 24 తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఇటీవలే సినిమా ట్రైలర్ విడుదలైంది.

- Advertisement -

Also Read: పోర్న్ స్టార్ కన్నా దారుణం.. అనిమల్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్

- Advertisement -

హాలీవుడ్ లో చారిత్రక అంశాలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు డైరెక్టర్ రిడ్లె స్కాట్ ఈ సినిమాను రూపొందించాడు. ఇప్పుడు రాబోతున్న గ్లాడియేటర్ రెండో భాగానికి కూడా ఈయనే దర్శకత్వం వహించాడు. గ్లాడియేటర్-2 ట్రైలర్ లో కూడా విజువల్స్ భారీగా ఉన్నాయి. ఇందులో వచ్చే యుద్ధ సన్నివేశాలు కూడా మొదటి పార్ట్ కు ఏమాత్రం తీసిపోనివిగా ఉన్నాయి.

ట్రైలర్ లో చూపించిన గ్రాడియేటర్-2 కథ ప్రకారం.. మొదటిభాగంలో చనిపోయిన గ్లాడియేటర్ మేక్సిమస్ ను ఆదర్శంగా భావించిన రోమ్ సామ్రాజ్యానికి వారసుడు, రాజకుమారుడు లూసియస్ (విలన్ చక్రవర్తి కొమొడస్ మేనల్లుడు).. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కుంటాడు. చక్రవర్తి కొమొడస్ చనిపోయిన తరువాత రోమ్ రాజ్యాన్ని ఇద్దరు అన్నదమ్ములైన విలన్లు చేజిక్కించుకుంటారు. ఆ ఇద్దరు చాలా క్రూరమైన చక్రవర్తులు. లూసియస్ అడవుల్లో పెరిగి.. చివరికి బానిసగా మారతాడు. అతడిలో టాలెంట్ ని చూసిన మాక్రినస్ (నటుడు డెన్ జెల్ వాషింగ్ టన్) తన పగ కోసం హీరోని వాడుకుంటాడు. హీరో కూడా తిరిగి రోమ్ సామ్రాజ్యాన్ని పొందడానికి మాక్రినస్ తో చేతులు కలుపుతాడు.

Also Read: Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్ డాలర్లు !

అయితే కథలో విలన్లకు సంరక్షుకుడిగా జెనెరెల్ మార్కస్ అకాసియస్ గా ఉంటాడు. ఇతను గతంలో మొదటి భాగం హీరో వద్ద సైన్యంలో పనిచేసి ఉంటాడు. మహాభారతంలో కర్ణడు, భీష్ముడి తరహా విలన్లను కాపాడే పాత్ర అన్న మాట. హీరో లూసియస్ గ్లాడియేటర్ గా మారి.. ఇద్దరు విలన్ చక్రవర్తలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

గ్లాడియేటర్-2లో హీరో లూసియస్ పాత్రను యువ నటుడు పౌల్ మెస్కల్ పోషించాడు. అతడు నటించిన నార్మల్ పీపుల్, ఆఫ్టర్ సన్, ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ చిత్రాలు చూసి.. డైరెక్టర్ రిడ్లే స్కాట్ ఆడిషన్ చేయకుండానే గ్లాడియేటర్ సీక్వేల్ లో అవకాశం ఇచ్చాడు.

గ్లాడియేటర్ మొదటి భాగం ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్. అందుకే దీనికి సీక్వెల్ తీయడం పట్ల కొందరు నెటిజెన్లు సంతోషంగా ఉంటే.. మరికొందరు.. వ్యతిరేకిస్తున్నారు. 2000 సంవత్సరంలో విడుదలై ఇండియాలో సైతం భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమా గ్లాడియేటర్. మొదటి భాగం పరిపూర్ణంగా ఉందని.. దానికి సీక్వెల్ చేయడం సరికాదని కొందరు నెటిజెన్లు టీట్లు చేస్తున్నారు. అప్పట్లో సీనియర్ హీరో రసెల్ క్రో తో పొటీపడి ఈ పాల్ మెస్కల్ నటించగలడా.. అని సందేహం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. ఏదేమైనా.. గ్లాడియేటర్-2 నవంబర్ 22 అమెరికా విడుదల కాబోతోంది. అయితే అంతకంటే వారం రోజుల ముందే ఇండియాలో నవంబర్ 15న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News