Mumbai Crime: ఆ జంటకు వివాహం జరిగింది. పెళ్లయి కేవలం నెలన్నర మాత్రమే అయ్యింది. ఆమె భర్త డాక్టర్ కూడా. కోటి ఆశలతో పుట్టించి నుంచి అత్తింటికి వచ్చింది. అదే తన లోకమని నమ్ముకుంది. కాకపోతే అనుమానం అనే భూతం భర్తని వెంటాడడం మొదలుపెట్టింది. ఫలితంగా భార్యపై అనుమానంతో బెడ్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. సీన్ కట్ చేస్తే.. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?
ముంబైలో దారుణమైన ఘటన.. పెళ్లైన నెలన్నరకే పైలోకానికి నవవధువు
మహారాష్ట్రలోని ముంబై సిటీ సమీపంలో అంబర్‌నాథ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగి కేవలం 48 రోజుల్లో 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. కూతురు మృతి వార్త తెలియగానే మహిల తల్లిదండ్రులు షాకయ్యారు. విశాఖ-నితిన్ తిల్కర్‌కు ఏప్రిల్ 30న పెళ్లయ్యింది.
వివాహం తర్వాత అంతా బాగానే ఉందని అనిపించింది. ఆ తర్వాత వధువు భర్త-అత్తమామలు ఇచ్చిన కానుకలు, మర్యాదలు సరిగ్గా లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. పుట్టింటి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. విశాఖ ఇరుగుపొరుగు వారితో మాట్లాడటాన్ని కుటుంబసభ్యులు గమనించారు.
భర్త, ఆపై అత్త వేధింపులు.. ఆపై బెడ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, షాకైన భార్య
పక్కింటి వారితో విశాఖ మాట్లాడిందనే సాకుతో ఆమెను తీవ్రంగా కొట్టాడు భర్త. అత్తమామలతో కలిసి భర్త అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఇల్లంతా నిఘా పెట్టారని కొత్త విషయాలు బయటపెట్టారు. చివరకు బెడ్ రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. అత్తింట్లో జరుగుతున్న వేధింపుల గురించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరు మున్నీరు అయ్యేది విశాఖ.
పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే విశాఖ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. విశాఖ భర్త నితిన్ తిల్కర్, అత్త, మరిదిలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విశాఖ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగా వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.
ALSO READ: మురహరిపల్లిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి!