E-Paper

భారీ బ్యాటరీతో రాబోతున్న BMW iX5.. ఒకే ఛార్జ్‌ తో తో కళ్లు చెదిరే రేంజ్!

భారీ బ్యాటరీతో రాబోతున్న BMW iX5.. ఒకే ఛార్జ్‌ తో తో కళ్లు చెదిరే రేంజ్!
Advertisement

BMW పాపులర్ SUV అయిన X5ను న్యూ జనరేషన్ మోడల్‌ గా తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ తొలిసారిగా పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన BMW iX5ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో ఇప్పటి వరకు BMW ఉపయోగించిన వాటిలోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండబోతోందని కంపెనీ వెల్లడించింది.

కొత్త బ్యాటరీ గురించి..

తాజా సమాచారం ప్రకారం.. iX5లో మార్కెట్‌ ను బట్టి 141kWh, 144kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందించనున్నారు. ప్రస్తుతం BMW ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న బ్యాటరీల కంటే ఇది చాలా పెద్దది. iX3లో 112kWh బ్యాటరీ ఉండగా, iX మోడల్‌ లో 105.2kWh బ్యాటరీ మాత్రమే ఉంది. ఇప్పుడు అతిపెద్ద బ్యాటరీని తీసుకురానుంది.

ఫైనల్ టెస్టింగ్ లో న్యూ జెనరేషన్ X5

Advertisement

అటు న్యూ జెనరేషన్ X5 ప్రస్తుతం ఫైన్ టెస్టింగ్ దశలో ఉంది. అమెరికాలోని స్పార్టన్‌ బర్గ్ ప్లాంట్‌ లో దీని టెస్టింగ్ కొనసాగుతోంది. 2027 ప్రారంభంలో ముందుగా పూర్తిగా ఎలక్ట్రిక్ iX5ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2028లో పెట్రోల్, డీజిల్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV), అలాగే హైడ్రోజన్ వెర్షన్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు.

BMW iX5 కొత్త CLAR ప్లాట్‌ ఫారమ్‌ పై రెడీ అవుతోంది. ఈ SUVలో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉండనుంది. అధికారిక వివరాలు ఇంకా పూర్తిగా ప్రకటించకపోయినా,  తాజాగా రిపోర్ట్స్ ప్రకారం ఈ మోటార్లు కలిపి సుమారు 572 హెచ్‌పీ శక్తి, 805 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేయనుంది. ఈ కారు కేవలం 4.6 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో BMW తాజా 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ ను ఉపయోగిస్తోంది. సూపర్ స్పీడ్ ఛార్జింగ్‌ తో పాటు మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సిక్త్ జెనరేషన్ eDrive టెక్నాలజీతో కూడిన కొత్త హై వోల్టేజ్ బ్యాటరీ వ్యవస్థను కూడా ఇందులో ఉంటుంది.

Advertisement

అటు ఫిస్త్ జెనరేషన్ X5 హైడ్రోజన్ పవర్‌ తో వచ్చే తొలి BMW మోడల్ కానుంది. BMW ఇప్పటికే టయోటాతో కలిసి ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై పని చేస్తోంది. 2028లో హైడ్రోజన్ వెర్షన్‌ ను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అద్భుతంగా ఆకట్టుకునే డిజైన్ తో..

డిజైన్ పరంగా కూడా కొత్త X5లో భారీ మార్పులు కనిపించనున్నాయి. BMW కొత్త Neue Klasse డిజైన్ ను ఉపయోగిస్తోంది. సన్నని LED హెడ్‌ లైట్లు, కొత్త గ్రిల్ డిజైన్, ఆకట్టుకునే టెయిల్‌ లైట్లు, 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ SUVకి మరింత ప్రీమియం లుక్‌ ను ఇవ్వనున్నాయి. ఇంటీరియర్‌ కూడా అత్యంత లగ్జరీగా ఉంటుంది. విండ్‌ షీల్డ్ మొత్తం ఉండే పనోరమిక్ iDrive డిస్‌ ప్లే, 17.9 అంగుళాల భారీ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ధర ఎంత అంటే?

ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న X5 ధరలు రూ.95.40 లక్షల నుంచి రూ.1.11 కోట్ల వరకు ఉన్నాయి. కొత్త తరం X5, iX5 విదేశాల్లో విడుదలైన తర్వాత  భారత్ కు వచ్చే వచ్చే అవకాశం ఉంది. అయితే, ఏ పవర్‌ ట్రెయిన్లు మన మార్కెట్లో అందుబాటులోకి వస్తాయనే త్వరలోనే తెలియనుంది.

Read Also: రోడ్డెక్కిన ఫస్ట్ E85 కారు.. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ డెలివరీలు ప్రారంభం!

Related News

దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

రోడ్డెక్కిన ఫస్ట్ E85 కారు.. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ డెలివరీలు ప్రారంభం!

జస్ట్ రూ.6.29 లక్షలకే సిట్రోయెన్ eC3X.. BaaS స్కీమ్‌ తో అదిరిపోయే ఆఫర్!

450 కిమీ రేంజ్‌ తో మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV.. టాటా హారియర్ EV గట్టి పోటీ తప్పదా?

హీరో Xpulse 421 స్పై షాట్స్ లీక్.. లుక్ అదిరింది భయ్యా!

భారత్‌ లో E100 ప్యూయల్ కు గ్రీన్ సిగ్నల్.. ఆటో రంగంలో మరో ముందడుగు!

భారత్‌ లో మళ్లీ హైబ్రిడ్ కార్ల హవా.. ఏడాదిలో 6 కొత్తమోడల్స్ వచ్చేస్తున్నాయ్!

×