Road Accident: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న బ్రెజ్జా కారు (TS08JL8300), కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ (TG05T9635) ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో బ్రెజ్జా కారును నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రేఖ, కుమారుడు లోహిత్ (7), రేఖ సోదరి కుమారుడు నిహాల్ (2)లను స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎముకలకు తీవ్ర గాయాలైన లోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also read: Private School: ప్రభుత్వ నిభందనలకు తూట్లు.. అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహణ..!