E-Paper
Advertisement

Nizamabad Firing: నిజామాబాద్‌లో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‌ను చంపి పరారీ

Nizamabad Firing: నిజామాబాద్‌లో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‌ను చంపి పరారీ
Advertisement

Nizamabad Firing: నిజామాబాద్‌ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఇందల్‌వాయి మండలంలోని దేవీతండా వద్ద ముగ్గురు వ్యక్తులు ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారు. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్‌ మహమ్మద్ సల్మాన్‌ను కాల్చి పరారయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ సల్మాన్ తన లారీని NH 44 పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉంచిన సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం చంద్రాయన్‌పల్లి వరకు లారీలో వెళ్లిన నిందితులు.. ఓ డాబా వద్ద లారీ వదిలి పరారయ్యారు.

లారీ డ్రైవర్ పై కాల్పుల జరిపిన అనుమానితుల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పాత గొడవల నేపథ్యంలో కాల్పులు జరిపారా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Also Read: Guntur Crime: చిలకలూరిపేట కారు ఘటన.. వెలుగులోకి కొత్త కొత్త విషయాలు 

అటవీలోకి నిందితులు పరారీ

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో లారీ డ్రైవర్‌ మహ్మద్ సల్మాన్(48) ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో లారీలో వచ్చిన దుండగులు తుపాకీతో సల్మాన్ కాల్పి చంపి పరారయ్యారు. బాధితుడిని స్థానికులు ఇందల్వాయి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సల్మాన్‌ మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. దుండగులు చంద్రయాన్‌పల్లి వద్ద లారీని వదిలేసి అడవిలోకి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×