Love Marraige: ప్రేమ పెళ్లి వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. చినికి చినికి గాలివానగా మారింది. ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు అబ్బాయి ఫ్యామిలీకి అండగా ఉండడంతో అమ్మాయి తరపువారు అక్కడి నుంచి పరారయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఉమ్మడి కృష్టా జిల్లా తాళ్లూరుకి చెందిన యువకుడికి ఇన్‌స్టా ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. అది కాస్త ఫ్రెండ్ షిప్‌గా మారింది.. చివరకు ప్రేమకు దారి తీసింది. అమ్మాయిది గుంటూరు జిల్లాలోని ఏటూరు ప్రాంతం. వీరిద్దరు గంటల తరబడి ఛాటింగ్‌లు, ఫోన్ కాల్స్‌తో కొన్నాళ్లు కాలం వెల్లదీశారు.
ఏమైతేనేం వీరిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఓ ఇంటివారు అయ్యారు. ఈ లవ్ మ్యారేజ్‌లో అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. యువతికి ముందుగా మరొకరితో వివాహం జరిగినట్టు తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే.. ఈ నేపథ్యంలో యువతి కొద్దిరోజుల కిందట భర్తతో కలిసి అత్తింటికి వచ్చింది.
తమ కూతురు విషయం తెలుసుకున్న ఆమె పేరెంట్స్, బంధువులు శుక్రవారం రాత్రి యువకుడి ఇంటికి వెళ్లారు. మా కుమార్తెను అప్పగించాలని యువకుడి పేరెంట్స్‌తో గొడవకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య మాటలు ముదిరాయి. నువ్వెంత.. నువ్వెంత అనే స్థాయికి చేరాయి.
ALSO READ: ఆఫీసులో కుట్ర.. గర్భవతి సహోద్యోగికి విషం పెట్టిన మహిళ.. పని ఒత్తిడి వల్లేనా?!
కోపానికి గురైన ఇరు కుటుంబాల సభ్యులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.. 6 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమ్మాయికి చెందినవారు కార్లను వదిలేసి పరారైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ప్రేమ జంట వ్యవహారంలో ఇరు కుటుంబాల ఘర్షణ
యువతిని తీసుకెళ్లారంటూ బంధువుల ఆందోళన
యువతి బంధువులపై యువకుడి బంధువుల దాడి
6 కార్ల అద్దాలు ధ్వంసం, ఇద్దరికి గాయాలు
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులో ఉద్రిక్తత
తాళ్లూరు పీఎస్‌లో ఇరు వర్గాల ఫిర్యాదులు pic.twitter.com/mUKo6fetAb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025