BigTV English

Woman Spike Pregnant Colleague: ఆఫీసులో కుట్ర.. గర్భవతి సహోద్యోగికి విషం పెట్టిన మహిళ.. పని ఒత్తిడి వల్లేనా?!

Woman Spike Pregnant Colleague: ఆఫీసులో కుట్ర.. గర్భవతి సహోద్యోగికి విషం పెట్టిన మహిళ.. పని ఒత్తిడి వల్లేనా?!

Woman Spike Pregnant Colleague| ఉద్యోగులన్నాక రకరకాల కారణాలతో సెలవులు తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఆ ఉద్యోగి బాధ్యతలు మిగతా వారు పంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి కార్యాలయంలో నిత్యం జరిగేదే. ఇలాంటి సెలవుల వల్ల మిగిలిన సిబ్బంది ఇబ్బంది పడిన సందర్భాల్లో, పని భారం మోయలేకుండా ఉన్నామంటూ పైఅధికారులకు ఫిర్యాదులు చేసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉంటాయి. అయితే ఇబ్బంది తలెత్తిన ప్రతిసారీ మిగిలిన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆపై సర్దుకుపోతారు. కానీ చైనాలో ఓ యువతి మాత్రం సహోద్యోగి సెలవుపై వెళ్లడం అస్సలు సహించలేకపోయింది. ఆమెను ఎలాగైనా అడ్డుకునేందుకు కనీవినీ ఎరుగని దారుణానికి పాల్పడింది.


సౌత్ మార్నింగ్ పోస్టు కథనాల ప్రకారం, నిందితురాలు అక్కడి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. ఆమె సహోద్యోగి గర్భం దాల్చడంతో ప్రసూతి సెలవలు తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ నిందితురాలికి ఇది అస్సలు రుచించలేదు. ఆమె నెలల పాటు ప్రసూతి సెలవలపై వెళితే పని భారం మొత్తం తనపై పడుతుందని భావించింది. ఈ పరిస్థితిని ఎలాగైన అడ్డుకునేందుకు సహోద్యోగిపై దారుణానికి ఒడిగట్టింది.

Also Read: ఆస్పత్రిలో భర్త ఆపరేషన్.. డబ్బులు, నగలతో పరారైన భార్య.. హత్య కేసు


రోజూ ఆ సహోద్యోగి వినియోగించే నీళ్ల ఏదో పదార్థం కలపడం ప్రారంభించింది. దీంతో, నీళ్లు రుచి మారడాన్ని గుర్తించిన బాధితురాలు మొదట్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నీళ్లల్లో కాలుష్యం ఉండి ఉంటుందను కుని ఇంటి నుంచి కాచి చల్లార్చిన నీళ్లను తెచ్చుకునేది. అయినా కూడా రుచిలో మార్పు లేకపోవడంతో ఆమెకు సందేహం మొదలైంది. తన నీళల్లో ఎవరైనా ఏదైనా కలుపుతున్నారనే సందేహంతో తన డెస్క్‌పై ఐప్యాడ్ ఉంచి సీక్రెట్‌గా అంతా రికార్డు చేసింది. ఆ తరువాత వీడియోని చూసి షాకైపోయింది. నిందితురాలు తన బాటిల్‌లో ఏదో పౌడర్ కలుపుతుండటం చూసి ఆమెకు ఒళ్లు గగుర్పొడిచింది.

నల్ల దుస్తులు తరించిన తన సహోద్యోగి రోజూ తన డెస్క్ వద్దకు వచ్చి బాటిల్‌ మూత తీసి నీళ్లల్లో తెల్లటి పౌడర్ ఏదో కలుపుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో, బాధితురాల వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సహోద్యోగి ప్రసూతి సెలవులపై వెళ్లకుండా అడ్డుకునేందుకు నిందితురాలు ఈ దారుణానికి తెగబడినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే, ఆమె బాధితురాలి బాటిల్‌లో ఏకలిపిందనేది ఇంకా తెలియరాలేదు. అధికారులు ఆ శాంపిళ్లను పరీక్షలకు పంపించారు. పరీక్ష ఫలితం వచ్చిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారు.

ఘటనపై స్థానిక లాయర్ ఒకరు మాట్లాడుతూ నిందితురాలికి దురుద్దేశం ఉన్నట్టు తేలితే శిక్ష తప్పది పేర్కొన్నారు. బాటిల్‌లో ఆమె ఏమి కలిపిందీ, దానితో బాధితురాలికి హానీ జరిగిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా నిందితురాలపై అభియోగాలు నమోదవుతాయి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెను కలకలమే రేగింది. అవతలి వాళ్లు సెలవు తీసుకోకుండా విషప్రయోగానికి దిగడం ఏ రకమైన మనస్తత్వాన్ని సూచిస్తోంది? అని ఓ వ్యక్తి అన్నారు. నిందితురాలు బాగా క్రైమ్ సీరియళ్లు ఎక్కువ చూస్తోందేమో అని మరో వ్యక్తి సెటైరు పేల్చారు. ప్రభుత్వ పరీక్షలు ఇలాంటి వారిని జల్లెడపట్టలేవని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అందరం పొట్ట నింపుకునేందుకే పని చేస్తున్నాం కదా ఇలాంటప్పుడు సహోద్యోగులపై ఇంతటి క్రౌర్యం ఎలా పుడుతుందో అని మరో వ్యక్తి అన్నారు. ఇక పోలీసు రిపోర్టు నివేదికను బట్టి తదుపరి చర్య తీసుకుంటామని నిందితురాలు పని చేస్తున్న సంస్థ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×