Fire Accident: యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా యాదిగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో భారీపేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ సైరన్ ఇవ్వడంతో వెంటనే అక్కడి నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు.
Also Read: కులగణన సర్వేలో సంచలన విషయాలు.. క్రెడిట్ రేవంత్ సర్కార్‌దే
సాధారణంగా ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు పదార్దాలు తయారు చేస్తూ ఉంటారు. నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే.. పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా పేలుడు సంభవించింది. అనేక మంది కార్మికులు గాయపడిన కూడా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. కార్మికుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరో వైపు ఈ పేలుడు ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.