Premalu: మామూలుగా సినిమాలు హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యమే.. కానీ ఎంత ప్రమోషన్స్ చేసినా మూవీ విడుదలయిన మొదటిరోజే ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం.. ఆ తర్వాత ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రారు. అందుకే ఒక మూవీకి మౌత్ టాక్ అనేది కూడా ముఖ్యమే. ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి 2024లో విడుదలయిన ‘ప్రేమలు’. ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి కేవలం మౌత్ టాక్‌తోనే సెన్సేషనల్ హిట్ సాధించింది. అలాంటి ఈ సినిమా ఖాతాలో తాజాగా మరొక ఊహించని రికార్డ్ వచ్చి చేరింది. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
అత్యధిక లాభాలు
2024లో దాదాపు సౌత్ సినిమా మొత్తం తన సత్తా ఏంటో చాటింది. చాలావరకు సౌత్ నుండి విడుదలయిన సినిమాలు హిట్ టాక్‌ను అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. అదే ఏడాది ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘స్త్రీ 2’ లాంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యి కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయాయి. కానీ అసలైన సర్‌ప్రైజ్ ఏంటంటే వాటన్నింటిని దాటేసి ఒక చిన్న బడ్జెట్ మలయాళ సినిమాల అత్యధిక లాభాలు సాధించింది. 2024లో అత్యంత లాభాలు సాధించిన సినిమాగా నిలిచింది ‘ప్రేమలు’. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ షాకవుతున్నారు. అయినా ‘ప్రేమలు’కు ఆ అర్హత దక్కడం కరెక్టే అంటున్నారు.
Also Read: ‘విశ్వంభర’ నుండి వారంతా ఔట్.. అదే కారణమా.?
వాటికి మించి
‘ప్రేమలు’ (Premalu) సినిమా బడ్జెట్ కేవలం రూ.3 కోట్లు. అందులో పెద్దగా అందరికి తెలిసిన నటీనటులు లేరు. స్టార్ యాక్టర్లు లేరు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.136 కోట్లు వచ్చాయి. అంటే బడ్జెట్‌కు 45 రెట్లు ఎక్కువ. అన్ని రెట్లు ఎక్కువ లాభాలు ఏ పాన్ ఇండియా సినిమాకు కూడా రాలేదు. ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలకు కూడా లాభాలు వచ్చినా వాటి బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 5 రెట్లు లాభాలు ఎక్కువగా వచ్చి ఉండవచ్చు. కానీ ‘ప్రేమలు’ ఏకంగా 45 రెట్లు ఎక్కువ లాభాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో 2024లో అత్యధిక లాభాలు సాధించిన సినిమాల లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఈ మూవీ ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోనే షూటింగ్
గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమలు’లో నస్లీన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. పైగా హైదరాబాద్‌ను మొత్తం చూపిస్తూ సినిమాలో ఒక స్పెషల్ తెలుగు సాంగ్ కూడా ఉంది. అలా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ముందుగా ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వకపోయినా మలయాళంలోనే చాలామంది ప్రేక్షకులు చూసేశారు. మలయాళంలో విడుదలయిన దాదాపు రెండు నెలల తర్వాత తెలుగు డబ్బింగ్ వర్షన్ థియేటర్లలో విడుదలయ్యింది. అప్పుడు కూడా ఈ మూవీని చూడడానికి చాలామంది ప్రేక్షకులు వచ్చారు. అలా లాభాలు విపరీతంగా పెరిగిపోయాయి.