E-Paper
Advertisement

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!
Advertisement

Nuzvid: క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూజివీడుకు చెందిన షేక్ సుభాని (35) అనే యువకుడు డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా అతడు క్రికెట్ బెట్టింగులతో పాటు వివిధ ఆన్‌లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు.

ఈ వ్యసనాల వల్ల సుభాని భారీగా డబ్బులు నష్టపోయాడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించే క్రమంలో తెలిసిన వారి వద్ద, బయట పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. రోజురోజుకూ అప్పుల భారం పెరిగిపోవడం, ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Advertisement

చివరకు ఆ అప్పుల బాధను తట్టుకోలేక, నూజివీడులోని తన కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×