E-Paper
Advertisement

మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Advertisement

Mrigasira Karthi: ఏపీ అయినా, తెలంగాణ అయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె అంటే ముందుగా గుర్తొచ్చేది చేపలే. ఈ ఒక్కరోజు నాన్ వెజ్ ప్రియులంతా.. మిగతావన్నీ పక్కనపెట్టేసి చేపలు, రొయ్యలు తినడం పక్కా. అందుకే.. మృగశిర కార్తె వస్తే చాలు.. చేపలు, రొయ్యలు.. కర్రీగానో, పులుసుగానో, ఫ్రైగానో.. ప్లేట్‌లోకి రావాల్సిందే!

మృగశిర కార్తె అంటే ఏమిటి.?

Advertisement

సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్నే మృగశిర కార్తె అంటారు. ఈ సోమవారం నుంచే మృగశిరకార్తె ప్రారంభమవుతోంది. ఈరోజున.. చేపలు, రొయ్యలు తినడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మృగశిరకార్తెను.. ముంగిట చలి అంటారు పెద్దలు. అంటే.. ఈరోజు నుంచే వాతావరణం అకస్మాత్తుగా చల్లబడటం మొదలవుతుంది. అంటే.. వర్షాకాలం మొదలైంది అని చెప్పడానికి ఇదే సింబాలిక్ డే.

పూర్వీకులు సాంప్రదాయం

Advertisement

ఇప్పటిదాకా వేసవిలో మన శరీరం విపరీతమైన వేడికి గురై ఉంటుంది. కానీ.. మృగశిరకార్తె నుంచి వాతావరణంలో వచ్చే మార్పులతో.. శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి.. జలుబు, దగ్గు, ఉబ్బసం, కీళ్ల నొప్పుల లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ కాలంలోనే.. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, రకరకాల వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుంది. అందువల్లే.. మన పూర్వీకులు మృగశిరకార్తె రోజున చేపలు, రొయ్యలు తినే సంప్రదాయాన్ని పెట్టారు.

సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం

చేపలు, రొయ్యల్లో.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్-డి పుష్కలంగా ఉంటాయ్. ఇవి శరీరానికి అవసరమైన వేడిని అందించి, వ్యాధి నిరోధక శక్తిని.. బూస్ట్ చేస్తాయ్. ప్రధానంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారికి.. మృగశిర రోజున చేపలు తినడం వల్ల ఎంతో రిలీఫ్ దొరుకుతుందని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రజల్లో చేపలు, రొయ్యలు తినడం వల్ల పెరిగే పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మృగశిర కార్తె రోజునే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆక్వా రైతులు.

పేదల కోసం భారీ విందు ఏర్పాటు

జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో.. పాలకొల్లు వేదికగా పేదల కోసం భారీ విందు ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో చేపల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. మృగశిరకార్తె రోజున పేదవాడు చేపల కూర తినకుండా ఉండొద్దనే సంకల్పంతో.. రకరకాల చేపల కూరలు, ఫ్రైలతో పాటు గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురుతో కూడిన కమ్మని భోజనాన్ని ఉచితంగా వడ్డించనున్నారు. నోటి రుచి కోసమే కాదు.. రాబోయే వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. మృగశిర కార్తె రోజున చేపలు, రొయ్యలు తినడం ఎంతో అవసరం. మన పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కోణం, ఆరోగ్య రహస్యం దాగున్నాయని చెప్పడానికి మృగశిర కార్తె.. బెస్ట్ ఎగ్జాంపుల్.

Also Read: జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేయొద్దు.. ‘పెద్ది’ ట్రోలింగ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

Related News

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ *స‌న్* స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా? లేన‌ట్టా??

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

బ్రిజ్ భూషణ్ అంత సుద్దపూసా.. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వదిలేదే లేదన్న వినేష్ ఫోగట్!

లివింగ్ రిలేషన్‌షిప్‌పై సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జ్‌మెంట్!

రాజకీయ విమర్శలా? మానసిక వేధింపులా.. తమిళనాడు నుంచి ఏపీ దాకా ఇదే రచ్చ!

న్యాయం ఆలస్యమైతే అన్యాయమే!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

Big Stories

Advertisement
×