వెంటనే డౌట్ రావడంతో అక్క రీతూ పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కింది. బిల్డింగ్ పైకి చేరుకున్న రీతు.. ఒక వైరు కాలికి తాక్కొని కిందకు పడిపోయింది. అప్పటికే అపార్టుపై నుంచి నీతా కిందకు దూకేసింది. దీంతో స్పాట్ లోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు ముందు నీతా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సోదరి రూతూ తెలిపింది.
నీతా సూసైడ్ తర్వాత ఆమె తండ్రి స్పందించారు. తనకు నలుగురు కుమార్తెలు అని చెప్పారు. అందులో నీతా రీతూ కవలపిల్లలు అని అన్నారు.. నీతా ఆర్మూరు క్షత్రియా పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతోందని, ఎందుకు చనిపోయిందో.. ఇప్పటికి అర్ధం అవ్వడం లేదన్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఫంక్షన్‌లో మంచిగా కనిపించిన నీతా.. అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది. కడుపు నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. నీతాకు ఏమైన సమస్యలు ఉన్నాయా..? ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నీతా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను విచారిస్తున్నారు. అయితే మృతురాలిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు కుటుంబ సభ్యులు.
Also Read: ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్.. డబ్బులు కోసం బుల్లెట్, ఐఫోన్ అమ్మి చివరకు
ఇదిలా ఉంటే.. ఒకే అపార్ట్‌మెంట్..! ఏడాది వ్యవధిలో ఒకే తరహాలో రెండు ఘటనలు..! నిన్న హైదరాబాద్.. గాజులరామారంలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది కదా..! అదే అపార్ట్‌మెంట్‌లో సేమ్ ఇట్లాంటి ఘటనే జరిగింది. 8 నెలల క్రితం భార్యా పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన జరిగినప్పుడు తేజస్విని దంపతలు… అదే అపార్ట్‌మెంట్‌లో పక్క బ్లాక్‌లో ఉన్నారు. 8 నెలలు తిరిగేలోపు.. తేజస్విని ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. దాంతో… ఆ అపార్ట్‌మెంట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.