Summer Skin Care: వేసవిలో మండే ఎండను నివారించడానికి సన్‌స్క్రీన్ వాడటం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మనం తొందరలో సన్ స్క్రీన్ వాడటం మర్చిపోతాము లేదా మన దగ్గర ఉండే సన్‌స్క్రీన్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని ఎలా రక్షించుకోవడం ముఖ్యం. కొన్ని సహజ పదార్థాలు మీ ముఖాన్ని ఎండ నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా టానింగ్ నుండి ఉపశమనం కూడా అందిస్తాయి. మరి సమ్మర్‌లో సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయంగా ఏవి పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం .
కలబంద జెల్:
కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చల్లబరుస్తాయి. అంతే కాకుండా వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఎండలో బయటకు వెళ్ళే ముందు.. ముఖంపై కాస్త కలబంద జెల్ అప్లై చేయండి. ఇది చర్మంపై సహజమైన కవచాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎండ నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె సహజ SPF లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తేలికపాటి సూర్యకాంతి నుండి కాపాడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా మారుస్తుంది. ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది. ప్రకాశవంతమైన చర్మం కోసం.. కొబ్బరి నూనె వాడటం చాలా మంచిది. తరచుగా కొబ్బరి నూనె వాడటం వల్ల సమ్మర్ లో కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
దోసకాయ:
దోసకాయలో 96% నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా సమ్మర్ లో వచ్చే మంట నుండి రక్షిస్తుంది. ఎండలో బయటకు వెళ్ళే ముందు దోసకాయ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. అది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా హానికరమైన కిరణాల నుండి కూడా కాపాడుతుంది.
క్యారెట్ రసం:
క్యారెట్లలో బీటా కెరోటిన్ , విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ప్రతి రోజు ఉదయం క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మాన్ని లోపలి నుండి బలంగా చేస్తుంది.
బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని హానికరమైన కిరణాల నుండి రక్షించడంతో పాటు తేమను అందిస్తుంది. కొన్ని చుక్కల బాదం నూనె తీసుకుని ముఖంపై మసాజ్ చేస్తే చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు, కాఫీ ఇలా వాడితే.. మెరిసే చర్మం
పెరుగు:
పెరుగులో లాక్టిక్ ఆమ్లం, జింక్ ఉంటాయి. ఇది చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు నల్లదనం కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా మీరు ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి వస్తే, పెరుగు రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
టమాటో రసం:
టమాటో లైకోపీన్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది. టమాటో రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించవచ్చు. అంతే కాకుండా టానింగ్ సమస్యను తొలగించుకోవచ్చు.