E-Paper
Advertisement

Psycho Killer: అందంపై ద్వేషం.. కుమారుడితో సహా నలుగురిని హతమార్చిన సైకో కిల్లర్

Psycho Killer: అందంపై ద్వేషం.. కుమారుడితో సహా నలుగురిని హతమార్చిన సైకో కిల్లర్
Advertisement

Psycho Killer: తనకంటే అందంగా ఎవరూ ఉండకూడదనే భయంకరమైన ఆలోచనతో ఓ మహిళా తన కుమారుడితో సహా నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న ఘటన హర్యానాలోని పానిపట్‌లో వెలుగులోకి వచ్చింది. పూనమ్ అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. 2023లో తన వదిన కూతురును అందంగా ఉందని చంపిన ఆమె, ఆ విషయం చూసిన తన సొంత కుమారుడిని కూడా చంపినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. ఇటీవల మరో చిన్నారిని నీటి టబ్‌లో ముంచి చంపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. సైకో కిల్లర్ పూనమ్‌ను పానిపట్ పోలీసులు అరెస్టు చేశారు.

అందంపై ద్వేషం పెంచుకున్న ఓ యువతి.. అందంగా ఉన్న అమ్మాయిలను హతమారుస్తుంది. హర్యానా పానిపట్ లో నలుగురు చిన్నారులను చంపిన సైకో కిల్లర్ యువతి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదని, అందంగా కనిపించే అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు పానిపట్ ఎస్పీ భూపేంద్ర సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

2023లో

Advertisement

2023లో పూనమ్ అనే మహిళ ఇద్దరు అమ్మాయిలను హతమార్చింది. తనపై అనుమానం రాకుండా ఉండటానికి తన సొంత కొడుకును కూడా చంపింది. తాజాగా నాల్గో చిన్నారిని హత్య చేయడంతో పోలీసులు నిఘా పెట్టి సైకో కిల్లర్ పూనమ్ ను పట్టుకున్నారు. ఏ అమ్మాయి తన కంటే అందంగా ఉండకూడదనే భావం ఆ మహిళ మనసులో ఉందని ఎస్పీ వివరించారు. అందుకే ఆమె అమ్మాయిలను టార్గెట్ చేసుకుందన్నారు.

అందమైన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకున్న పూనమ్.. తన బంధువులు, కుటుంబంలోని అందమైన అమ్మాయిలను హత్య చేసేది. అందంపై ద్వేషం పెంచుకున్న ఆమెకు అందమైన అమ్మాయిలంటే ద్వేషం. తనపై అనుమానం రాకుండా సొంత కొడుకును కూడా హత్య చేసింది.

సైకో కిల్లర్ ఎలా పట్టుబడింది?

Advertisement

ఆరేళ్ల బాలిక నీటి తొట్టిలో మునిగి చనిపోయింది. అలా బాలిక చనిపోయే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో పూనమ్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అందమైన అమ్మాయిని చూస్తే పూనమ్ పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిసుందని ఎస్పీ తెలిపారు.

Also Read: Kadapa Court Verdict: రైలులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

పానిపట్‌ భవద్ గ్రామానికి చెందిన నవీన్ భార్య పూనమ్ 2023లో తన వదిన కుమార్తె, తన సొంత కొడుకును హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్టులో సివా గ్రామంలో మరో బాలికను హత్య చేసింది. తాజాగా మరో 6 ఏళ్ల బాలికను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదు, ఎదగకూడదని ద్వేషంతో చిన్నారులను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పూనమ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో ఒకరిని ఆమె హత్య చేసిందని ఎస్పీ పేర్కొన్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×